AP News: అమలాపురంలో మిస్సింగ్ కేసు కలకలం..ఘోరమైన స్థితిలో డెడ్ బాడీ!

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ మిస్టరీగా మారడం కలకలం రేపుతోంది.  ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి గోదావరిలో శవమై తేలాడు.

New Update
Amalapuram

Amalapuram

AP News: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ మిస్టరీగా మారడం కలకలం రేపుతోంది.  ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి గోదావరిలో శవమై తేలాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  హత్యా లేదా ఆత్మహత్యా?  అనే కోణంలో విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..  కొంకపల్లికి చెందిన కంచిపల్లి శ్రీను అనే వ్యక్తి ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయాడు.  దీంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు  సమాచారం అందించి.. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇంతలోనే నిన్న మధ్యాహ్నం  పి. గన్నవరం మండలంలోని గోదావరి నది పాయలో ఒక మృతదేహం కనిపించింది.

గోదావరిలో డెడ్ బాడీ 

దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా.. అది ఐదు రోజుల క్రితం అదృశ్యమైన కంచిపల్లి శ్రీనుదిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే శ్రీను చనిపోయాడు అంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు . కేసు పెట్టిన వెంటనే పోలీసులు సరిగ్గా స్పందించి ఉంటే.. ఈరోజు శ్రీను బతికి ఉండేవాడని అమలాపురం స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. 

ఈ ఘటనపై జిల్లా ఎస్పీ  రాహుల్ మీనా స్పందిస్తూ.. మొదట మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ కేసును ఇప్పుడు హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నాము. త్వరలోనే శ్రీను హత్యకు కారణమైన నిందితులను పట్టుకొని  పూర్తి వివరాలు బయటపెడతామని తెలిపారు. శ్రీను కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 

AlSO Read: TG NEWS: పెళ్ళైన కొద్ది గంటల్లోనే ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జయిన కారు స్పాట్ లో 12 మంది!

Advertisment
తాజా కథనాలు