రామ్ చరణ్ ను నెట్టేసిన అల్లు అర్జున్.. || Ram Charan VS Allu Arjun || Game Changer VS Pushpa || RTV
సంద్య థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత తొలిసారి అల్లు ఫ్యామిలీ హ్యాపీగా కనిపించింది. నేడు అల్లు అరవింద్ బర్త్ డే సందర్భంగా బన్నీ, అతడి భార్య, తల్లి ఒకదగ్గర ఉన్నారు. తనతండ్రి అల్లు అరవింద్ కోసం బన్నీ ‘పుష్ప కా బాప్’ అంటూ ఓ కేక్ ఏర్పాటు చేశాడు. అది వైరల్ అవుతోంది.
మలయాళ హీరో ఉన్ని ముకుందన్ 'మార్కో' చిత్రాన్ని చూసిన అల్లు అర్జున్ సినిమా టీమ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో అల్లు అర్జున్ గారు దర్శకుడిని పిలిచి మొత్తం బృందాన్ని అభినందించారని పేర్కొంది.
'పుష్ప2’ రీలోడెడ్ వెర్షన్ వాయిదా వేసినట్టు చిత్ర బృందం వెల్లడించింది. సంబంధిత కంటెంట్ విషయంలో సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమవుతోందని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.ఈ నెల 17 నుంచి కొత్త సన్నివేశాలతో కూడిన సినిమాని చూడొచ్చని పేర్కొంది.
తెలంగాణలో గత ఏడాది 41,138 మంది ఖైదీలు జైల్లో ఉన్నారని జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా తెలిపారు. 483 మంది ఖైదీలను జైలు నుంచి విడుదల చేశామన్నారు. అల్లు అర్జున్ విడుదల కూడా చట్టప్రకారమే జరిగిందని జైళ్లశాఖలో ఎలాంటి లోపం లేదన్నారు.
'పుష్ప 2' సినిమాలో మరో 20 నిముషాల ఫుటేజ్ ను యాడ్ చేసి రిలీజ్ చేస్తుండటంపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అసలే మూడు గంటల సినిమా నిడివి తగ్గించాల్సింది పోయి.. మళ్ళీ ఇంకో 20 నిముషాలు జతచేయడం అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు
బన్నీ అరెస్ట్ తర్వాత స్నేహారెడ్డి తొలిసారిగా పోస్ట్ చేసింది. డిసెంబర్లో జరిగిన జ్ఞాపకాలను ఓసారి గుర్తు చేసుకుంది. 'ఆల్ డిసెంబర్ మూమెంట్స్ ఇన్ వన్ ప్లేస్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది'. ఇందులో అయాన్, అర్హతో బన్నీ ఆడుకుంటున్న ఫోటోలు కూడా ఉన్నాయి.