పవన్ కల్యాణ్ ఇంటికి అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా?

పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్ తన సతీమణి స్నేహతో కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడటంతో ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం మార్క్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.

New Update
Pawan kalyan

Pawan kalyan

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెళ్లినట్లు తెలుస్తోంది. సింగపూర్‌లో ఓ స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి కలిశారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. 

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

భార్య స్నేహతో కలిసి..

అల్లు అర్జున్‌తో పాటు తన భార్య స్నేహ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. అయితే ఎన్నికల సమయం నుంచి మెగా ఫ్యామిలీలో గొడవలు వినిపిస్తున్నాయి. దీంతో కాస్త గ్యాప్ పెరిగింది. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో కూడా పవన్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లలేదు. దీని తర్వాత అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కలుసుకోవడం ఇదే మొదటిసారి. 

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్నకుమారుడు మార్క్ శంకర్‌కు సింగపూర్‌లో ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం వల్ల చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. అయితే ప్రస్తుతం మార్క్ శంకర్ హైదరాబాద్‌లో ఉన్నాడు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు