/rtv/media/media_files/2025/04/20/4kEgIhHEO8t42XELjMre.jpg)
Pushpa 2 VFX
Pushpa 2 VFX: ఇటీవలి కాలంలో తెలుగు సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ప్రాధాన్యం పెరిగిపోయింది. కొన్ని సినిమాలకైతే అవసరం ఉన్నా లేకున్నా విచ్చలవిడిగా గ్రాఫిక్స్ వాడేస్తున్నారు. ప్రేక్షకులకు ఏది గ్రాఫిక్స్? ఏది నిజం? అన్నది గుర్తుపట్టలేనంతగా టెక్నాలజీ ఎదిగింది. ఈ విషయాన్ని తాజాగా విడుదలైన ‘పుష్ప 2’ VFX బ్రేక్ డౌన్ వీడియో స్పష్టంగా చూపిస్తోంది.
Also Read: “ఓదెల 2” ఫస్ట్ డే కలెక్షన్స్ తుస్.. విజువల్స్ ఎక్కువ విషయం తక్కువ..!
ఈ సినిమా ప్రారంభంలో అల్లు అర్జున్(Allu Arjun) ఎంట్రీ లో చూపించిన జపాన్ ఫైట్ సీక్వెన్స్, మాల్దీవుల సీన్, పుష్ప డెన్, రామేశ్వరం పడవల ఛేజింగ్, చందన దుంగల లారీలు- ఇవన్నీ సహజంగా, నిజంగా షూట్ చేసినట్టు అనిపించాయి. కానీ నిజానికి ఇవన్నీ గ్రాఫిక్స్ ద్వారా రూపుదిద్దుకున్నవేనని తాజాగా విడుదల చేసిన వీడియో చుస్తే అర్థం అవుతోంది.
Also Read: 'రాబిన్ హుడ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
సుకుమార్ రైటింగ్స్ యూట్యూబ్ ఛానెల్‌లో
సుకుమార్(Sukumar) రైటింగ్స్ సంస్థ తన యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసిన వీఎఫ్ఎక్స్ బ్రేక్‌డౌన్ వీడియో సుమారు 6 నిమిషాల నిడివి ఉంది. ఈ వీడియో చూస్తే, పుష్ప 2 లో కీలక సన్నివేశాల్లో చాలా భాగం కంప్యూటర్ గ్రాఫిక్స్ సాయంతోనే రూపొందించారని స్పష్టమవుతుంది.
Also Read: ఫ్యాన్స్ మీట్‌లో షాకింగ్ డెసిషన్ బయటపెట్టిన సూర్య..
జపాన్ ఫైట్, రామేశ్వరం ఛేజింగ్, తదితర ప్రధాన సన్నివేశాలన్నీ గ్రాఫిక్స్‌తో రూపొందించి ప్రేక్షకులకు రియాలిటీ ఫీలింగ్ ఇవ్వడంలో టీమ్ సక్సెస్ అయ్యింది. ఈ వీఎఫ్ఎక్స్ మ్యాజిక్ 'పుష్ప 2'ను బ్లాక్ బస్టర్ హిట్ చేసిందని చెప్పొచ్చు.
Also Read: అరేయ్ ఏంట్రా ఇది.. సడన్‌గా చూసి నిజం అనుకున్నాం కదరా బాబు..