HBD Allu Arjun: ఆ రికార్డ్ సాధించిన తొలి తెలుగు హీరో అర్జున్.. పుష్ప బ్రాండ్‌ను కొట్టేవాడే లేడా?

నేడు అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా మొదటి సినిమా గంగోత్రితో ఎన్నో అవమానాలు పడిన బన్నీ పుష్ప సినిమాతో ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగాడు. తెలుగు చిత్ర సీమలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును క్రియేట్ చేశాడు. నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

New Update
hbd allu arjunhbd allu arjun

hbd allu arjun

Happy Birthday Allu Arjun

మొదటి సినిమాతో ఎన్నో అవమానాలకు గురయ్యాడు అల్లు అర్జున్. గంగోత్రి సినిమాలో బన్నీని చూసి ఇతడు హీరోనా అంటూ ఎంతో మంది నోరెళ్లబెట్టారు. బన్నీది హీరో మెటీరియల్ కాదే అంటూ గుసగుసలాడారు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చాడు బన్నీ. తొలి మూవీ గంగోత్రి మంచి హిట్ టాక్ అందుకున్నా.. అందులో హీరోగా నటించిన బన్నీకి మాత్రం విమర్శలే ఎదురయ్యాయి. 

Also Read: పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

ఆ విమర్శలను, అవమానాలను మనసులో పెట్టుకున్న బన్నీ.. తనలోని లోపాన్ని సరిదిద్దుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా తనలోని బలాన్ని రెట్టింపు చేసుకున్నాడు. సరైన సమయం కోసం ఎదురుచూశాడు. కట్ చేస్తే 20 ఏళ్ల తర్వాత పుష్పగాడి రూల్ ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించాడు. తెలుగు చిత్ర సీమలో ఇంత వరకు ఏ దిగ్గజ నటుడికి సాధ్యం కాని ఘనత అల్లు అర్జున్ సొంతమైంది. నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డును సాధించాడు. తెలుగు మహామహులైన ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీర్ వంటి దిగ్గజాలకే ఆ అవార్డు దక్కలేదు. కానీ పుష్పతో బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్నాడు. 

Also Read: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

తనను ఎవరైతే విమర్శించారో.. తనను ఎవరైతే అవమానించారో.. తనను హీరో మెటీరియల్ కాదని ఎవరైతే హేళన చేశారో వారందరూ ప్రశంసించేలా ఎదిగాడు. ఇప్పుడు అల్లు అర్జున్ బ్రాండ్ కేవలం ఇండియాలోనే కాదు.. ఏకంగా వరల్డ్ వైడ్‌గా స్థిరపడింది. ఇవన్నీ ఇప్పుడెందుకు అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా అతడి విజయాపజయాలు చూసి అంతా అవాక్కవుతున్నారు. గంగోత్రి తర్వాత ఆర్య సినిమా తీసి ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు.

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

ఆ తర్వాత బన్నీ, హ్యాపీ, దేశముదురు అంటూ దూసుకుపోయాడు. డ్యాన్స్ చేస్తే ఇలాగే చెయ్యాలి. ఫైట్లు అంటే బన్నీలానే తెగించాలి. హీరో అంటే ఇలాగే ఉండాలి అనేంతలా పాపులర్ అయిపోయాడు. అనంతరం కొన్ని పరిస్థితులు అతడిని కిందికి నెట్టాయి. బద్రీనాథ్, ఆర్య 2, వరుడు వంటి సినిమాతో డీలా పడ్డాడు. కానీ తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ఆ తర్వాత వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, డీజే, సరైనోడు వంటి చిత్రాలు మళ్లీ బన్నీని ట్రాక్‌లోకి తెచ్చాయి. 

ముఖ్యంగా రేసుగుర్రంతో పరుగులెట్టాడు. అలా వైకుంఠపురంలో సినిమాలో స్టైలిష్ లుక్‌తో అదరగొట్టేశాడు. అక్కడ నుంచి బన్నీ ఓ నిర్ణయానికొచ్చాడు. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. తన మార్కెట్ నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్‌గా కొల్లగొట్టాలని అనుకున్నాడు. అనుకున్న విధంగానే ఇంటర్నేషనల్ వైడ్‌గా తన బ్రాండ్‌ను లిఖించుకున్నాడు. 

Also Read: క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

పుష్ప, పుష్ప2 సినిమాలతో అద్బుతం చేశాడు. ఎన్నో విమర్శలు వచ్చినా.. సినిమా మాత్రం దూసుకుపోయింది. అతడి విజయాన్ని చూసి విమర్శకులు తలలు దించుకున్నారు. ఒక్కటే దెబ్బ.. రెండు వేల కోట్లు మైత్రి మూవీ మేకర్స్ ఖాతాలో పడ్డాయి. ఇక ఇప్పుడు బన్నీ మరొక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అందువల్ల బన్నీకి RTV తరఫున ఆల్ ది బెస్ట్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్ డే.

(allu-arjun | bunny | bunny-birthday | latest-telugu-news | telugu-news)

#telugu-news #Allu Arjun #bunny #bunny-birthday #latest-telugu-news
Advertisment
తాజా కథనాలు