Aghori First Wife Interview: అఘోరీ పచ్చి మోసగాడు.. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటాడు - ఫస్ట్ వైఫ్ సంచలన ఇంటర్వ్యూ

లేడీ అఘోరి మొదటి భార్య రాధిక, అఘోరిపై సంచలన ఆరోపణలు చేసింది. ‘‘అఘోరికి రాష్ట్రానికో అమ్మాయి ఉంటుంది. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు పిల్లల తల్లితో సంబంధం ఉంది’’ అని రాధిక పేర్కొంది. అఘోరి మోసగాడని, అమ్మాయిలను వాడుకుని వదిలేస్తాడని పేర్కొంది.

New Update
Aghori First Wife Interview

Aghori First Wife Interview

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే అఘోరీ పలు కేసుల్లో జైలుపాలవగా.. కొన్నింటిలో బెయిల్ వచ్చింది. కానీ అతని మొదటి భార్యనని చెప్పుకుంటున్న రాధిక అనే మహిళ పెట్టిన కేసులో మాత్రం ఇంకా బెయిల్ రాలేదు. దీంతో అఘోరీ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇవాళ కరీంనగర్ కోర్టులో హాజరయ్యాడు. కానీ బెయిల్ రిజెక్ట్ అయింది. 

Also Read: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు

Aghori First Wife Interview

ఇందులో భాగంగా రాధిక మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. అఘోరి పచ్చి మోసగాడని, ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటాడని తెలిపింది. అతడికి ‘‘రాష్ట్రానికో అమ్మాయి’’ ఉంటుందని తీవ్ర ఆరోపణలు చేసింది. తాజాగా RTV ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధిక మాట్లాడుతూ.. అఘోరి తనను మోసం చేశాడని, అనేక మంది అమ్మాయిలకు మాయమాటలు చెప్పి.. వాడుకుని వదిలేస్తున్నాడని ఆరోపించింది. మధ్యప్రదేశ్‌లో ఇద్దరు పిల్లల తల్లితో అఘోరి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఆ మహిళ అందంగా ఉందని తనతో చెప్పేవాడని రాధిక వెల్లడించింది.

Also Read: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్

‘‘అఘోరి దగ్గరకు ఎవరైనా తమ బాధలు చెప్పుకోవడానికి వెళ్తే, వాళ్లను ఆకర్షించి వాడుకుంటాడు. అవసరం తీరాక వదిలేస్తాడు’’ అని రాధిక తీవ్ర ఆరోపణలు చేసింది. అఘోరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. 

Also Read: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్

గతంలో కూడా రాధిక తాను అఘోరి మొదటి భార్యనని, కొండగట్టు ఆలయంలో తమ వివాహం జరిగిందని ఆడియో రికార్డింగ్‌లతో సహా మీడియా ముందుకు వచ్చింది. అయితే, అఘోరి ఆ ఆరోపణలను ఖండిస్తూ, రాధిక తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని, ఆమెకు తాను ఎటువంటి తాళి కట్టలేదని చెప్పుకొచ్చాడు. 

లేడీ అఘోరి, శ్రీ వర్షిణిల వివాహం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు రాధిక చేసిన ఈ తాజా వ్యాఖ్యలు ఈ వ్యవహారానికి మరింత వేడిని పెంచాయి. ఈ వివాదంపై పోలీసులు, సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు