Lady Aghori release: అఘోరీ ఈజ్ బ్యాక్.. వర్షిణికి బిగ్ షాక్

చీటింగ్ కేసులో అరెస్టయిన అఘోరీ శ్రీనివాస్ మంగళవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. మూడు నెలల క్రితం శ్రీనివాస్‌ను పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేసి హైదరాబాద్‌ తీసుకొచ్చారు. నాలుగు కేసుల్లో ఆఘోరీకి బెయిల్ వచ్చింది.

New Update
Aghori

Aghori Srinivas release

చీటింగ్ కేసులో అరెస్టయిన అఘోరీ శ్రీనివాస్ మంగళవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. వివిధ పూజల పేరుతో ప్రజలను మోసం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్‌ను పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేసి హైదరాబాద్‌ తీసుకొచ్చారు. వైద్య పరీక్షల్లో శ్రీనివాస్ ట్రాన్స్‌జెండర్‌గా తేలడంతో పోలీసులు ఆయనను మహిళా జైలుకు తరలించారు. మూడు నెలలుగా లేడీ అఘోరీ శ్రీనివాస్ చంచల్‌గూడ మహిళా జైలులో ఉన్నారు. మత విశ్వాసాల పేరుతో మోసాలకు పాల్పడిన కేసులో వేములవాడ, కొమురవెల్లి, చేవెళ్ల, కరీంనగర్‌లో అఘోరీ శ్రీనివాస్‌పై 4 కేసులు నమోదైయ్యాయి. వాటన్నీటిలో బెయిల్ వచ్చింది.

అఘోరీ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పత్రాలు జైలు అధికారులకు అందడంతో, మంగళవారం శ్రీనివాస్‌ను విడుదల చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కాశీకి వెళ్తున్నట్లు మీడియాకు తెలిపారు. 

అఘోరీ శ్రీనివాస్ విడుదల వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఒకప్పుడు పూజలు, మంత్రాల పేరుతో ప్రజలను ఆకట్టుకున్న శ్రీనివాస్, ఆ తర్వాత మోసాలు, బెదిరింపుల కేసులతో వార్తల్లో నిలిచారు. తాజాగా జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉంటాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వివిధ కేసుల్లో విచారణ అనంతరం అఘోరీ శ్రీనివాస్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కరీంనగర్‌కు చెందిన ఒక యువతి తనపై అత్యాచార యత్నం చేశాడని పెట్టిన కేసుతో సహా మొత్తం నాలుగు కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది. బెయిల్ మంజూరు సందర్భంగా కోర్టు కొన్ని షరతులను విధించింది. బెయిల్ నిబంధనల ప్రకారం, ప్రతి గురువారం కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. రూ. 10 వేల జరిమానా కూడా చెల్లించాలని పేర్కొంది. ఈ పత్రాలు జైలు అధికారులకు అందడంతో, శ్రీనివాస్‌ను మంగళవారం విడుదల చేశారు. 

Advertisment
తాజా కథనాలు