Mancherial : ప్రియురాలి మరణ వార్తతో బావిలో దూకిన ప్రియుడు

మంచిర్యాల జిల్లా కొర్విచెల్మలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేర్వేరు ప్రదేశాల్లో ప్రేమజంట అనుమానస్పద మృతి చెందారు. హైదరాబాద్‌లో రైలు కింద పడి హితవర్షిణి చనిపోయింది. ప్రియురాలి మరణ వార్తతో బావిలో దూకి వినయ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

New Update
lovers

మంచిర్యాల జిల్లా కొర్విచెల్మలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేర్వేరు ప్రదేశాల్లో ప్రేమజంట అనుమానస్పద మృతి చెందారు. హైదరాబాద్‌లో రైలు కింద పడి హితవర్షిణి చనిపోయింది. ప్రియురాలి మరణ వార్తతో బావిలో దూకి వినయ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన లవర్ లేకుండా బ్రతకలేనంటూ వినయ్ ఆత్మహత్యకు ముందు లెటర్‌ రాశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోలేదని చనిపోయారా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్ డేటా ఆధారంగా పోలీసుల విచారణ చేపట్టారు. కాగా ప్రేమజంట మృతితో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 

పేషెంట్ పై లైంగిక దాడి

జ్వరం వచ్చిందని ఆస్పత్రికి వచ్చిన పేషెంట్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడు కంపోండర్. ఆదివారం  జిల్లా కేంద్రంలోని దీపికా ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.  జగిత్యాల జిల్లాకు చెందిన ఓ యువతి అనారోగ్యంతో కరీంనగర్ నగరంలోని దీపిక ఆసుపత్రిలో చేరింది. వైద్యులు చికిత్స నిమిత్తం ఆమెను అడ్మిట్ చేసుకున్నారు. అయితే  రాత్రి సమయంలో ఆ యువతి బెడ్‌ వద్ద ఎవరు లేకపోవడంతో ఆసుపత్రి కాంపౌండర్ దీక్షిత్ ఆమెకు మత్తుమందు ఇచ్చి.. ఘోర అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం జరిగిన ఘటనను యువతి తన కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు ఆగ్రహంతో ఆదివారం ఉదయం   పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పేషెంట్ ను గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు త్రీ టౌన్ పోలీసులు.

Advertisment
తాజా కథనాలు