Premsagar Rao : కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు సీరియస్... లేటెస్ట్ అప్ డేట్ ఇదే!

కాంగ్రెస్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ (AIG) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

New Update
kokkirala

కాంగ్రెస్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన  హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ (AIG) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్యాన్సర్ బారిన పడి తీవ్రమైన అనారోగ్యానికి గురై గత కొద్దిరోజులుగా ఆయన చికిత్స పొందుతున్నారు.

ప్రచారంలో ఎలాంటి నిజం లేదు

ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును హుటాహుటిన కోయంబత్తూరుకు తరలించారని వస్తున్న వార్తలను ఆయన పీఏ ఖండించారు. ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారని పేర్కొన్నారు.  ఎమ్మెల్యే ఆరోగ్యంపై కొంతమంది పనిగట్టుకొని వివిధ రకాల ప్రచారం చేస్తున్నారని, అలాంటి వాటిని నమ్మవద్దన్నారు. ప్రేమ్ సాగర్ రావు ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు లేదా ఆసుపత్రి వర్గాల నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్సీగా పనిచేసిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు..  2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గం నుండి పోటీ చేసి  తన సమీప ప్రత్యర్థి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావుపై 66,116 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆయన మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 

Advertisment
తాజా కథనాలు