Road Accident: అయ్యో దేవుడా.. ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్
పాట్నాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా ప్రయాణించిన కారు ముందుగా వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు స్పాట్లో ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా పాట్నాలోని కుర్జీ, గోపాల్పూర్, పటేల్ నగర్ ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు.