HYD: చైనా మాంజాతో మరో ముగ్గురికి గాయాలు...తీవ్ర గాయాలు కావడంతో...

చైనా మాంజాతో ప్రాణాలు పోతున్నాయని తెలిసినా వాటి అమ్మకాలు, వినియోగం ఆగటం లేదు. ఏకంగా  హైకోర్టు చెప్పినా ఆగని చైనా మాంజా విక్రయాలు ఆగకపోవడంతో మరో ముగ్గురు ప్రాణపాయంలో చిక్కుకున్నారు. అమ్మకాలను హైకోర్టు నిషేధించిన నగరంలో విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

New Update
FotoJet - 2026-01-11T182511.837

Three more injured in Chinese manja...severe injuries..

China manja : చైనా మాంజాతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రాణాలు పోతున్నాయని తెలిసినా వాటి అమ్మకాలు, వినియోగం ఆగటం లేదు. ఏకంగా  హైకోర్టు చెప్పినా ఆగని చైనా మాంజా విక్రయాలు ఆగకపోవడంతో మరో ముగ్గురు ప్రాణపాయంలో చిక్కుకున్నారు.. చైనా మాంజా అమ్మకాలను హైకోర్టు నిషేధించిన నగరంలో విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా ఉప్పల్‌లో మాంజా తగిలి ఓ యువకుడు గాయపడ్డాడు. సాయివర్దన్‌ రెడ్డి అనే యువకుడు బైక్‌పై వెళుతుండగా గొంతుకు మాంజా తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని వెంటనే ప్రైవేట్‌ దవాఖానలో చేర్పించారు. ప్రస్తుతం సాయివర్దన్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, చైనా మాంజా కారణంగా మనుషులతో పాటు పక్షులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పక్షులు, విద్యుత్ తీగలు, ప్రజా ఆస్తులకు కూడా భారీ నష్టం జరుగుతుందని పోలీసులు తనిఖీలు పెంచి మాంజా విక్రయాలను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌..

చైనా మాంజా చుట్టుకుని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేటకు బైక్‌పై వెళ్తుండగా చైనా మాంజా చుట్టుకోవడంతో చైతన్య చేయి తెగింది. బోటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పైకి రాగానే చైతన్య చేయికి తెగిన గాలి పటం మాంజా చుట్టుకుంది. చెయ్యి కోసుకుపోవడంతో తీవ్రంగా రక్తస్రావం జరిగింది. తీవ్రంగా గాయపడిన చైతన్యను స్థానికులు మాదాపూర్‌ ఆసుపత్రికి తరలించారు. గాయాలతో విలవిలలాడుతున్న చైతన్యను స్థానికులు హస్పటల్ కు తరలించారు.  ప్రస్తుతం ఉద్యోగి మాదాపూర్ లోని ప్రైవేట్ హస్పటల్ లో చికిత్స పొందుతున్నాడు. చైనా మాంజా వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ అవగాహన లేక కొందరు వినియోగిస్తుండటంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. పతంగులు ఎగురవేసే సమయంలో మాంజా తెగి గాలిలో వేలాడుతున్నాయి. దీంతో వాహనాలపై ప్రయాణించేవారికి చుట్టుకొని తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

సాగర్‌ హైవేపై..

మరోవైపు.. నల్గొండ జిల్లా తిరుమలగిరికి చెందిన సభావల్ మధు శుక్రవారం హైదరాబాద్ నుంచి తిరుమలగిరికి బైక్‌పై వెళ్తున్నారు. మార్గ మధ్యలో సాగర్ హైవేపై మాల్ మార్కెట్లో విద్యుత్ స్తంభానికి వేలాడుతున్న చైనా మాంజా చేతి వేళ్లకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. గుర్తించిన స్థానికులు యాచారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి.. చైనా మాంజా విక్రయిస్తున్న వ్యాపారి వివరాలపై ఆరా తీశారు. 

Advertisment
తాజా కథనాలు