BIG BREAKING: అక్షయ్ కుమార్‌ కారుకు రోడ్డు ప్రమాదం..

బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్‌ సెక్యూరిటీ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. జుహులోని ఆయన ఇంటికి సమీపంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరికి గాయాలయ్యాయి.

New Update
Akshay Kumar's security vehicle involved in Mumbai accident

Akshay Kumar's security vehicle involved in Mumbai accident

BIG BREAKING: బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్‌(Akshay Kumar) సెక్యూరిటీ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. జుహులోని ఆయన ఇంటికి సమీపంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్షయ్ కుమార్‌ ఆ కారులో లేరు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ప్రమాదానికి గురైన ఆ ఎస్కార్ట్‌ కారును అక్కడి నుంచి తరలించారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also read: కుల్దీప్‌ సెంగర్‌కు బిగ్ షాక్.. శిక్ష రద్దు పిటిషన్‌ను కొట్టివేసి కోర్టు

ఇక వివరాల్లోకి వెళ్తే.. అక్షయ్ కుమార్, తన భార్య ట్వింకిల్ ఖన్నాతో కలిసి తన కాన్వాయ్‌లో ముంబై ఎయిర్‌పోర్టు నుంచి తన ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలోనే వేగంగా వెళ్తున్న ఓ కారు ఆటోరిక్షాను ఢీకొంది. ఆ తర్వాత అది అక్షయ్ కుమార్‌ ఎస్కార్ట్‌ వాహనాన్ని ఢీకొంది. సోమవారం రాత్రి 9 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.  అయితే ఈ ప్రమాదంపై అక్షయ్ కుమార్‌ ఇంకా స్పందించలేదు.  

Advertisment
తాజా కథనాలు