/rtv/media/media_files/2025/11/03/fotojet-2025-11-03t072319958-2025-11-03-07-23-46.jpg)
Ambulance jumped signal and took lives.. Couple died
Ambulance Kills Couple: ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్సే ప్రాణాలు తీసింది. అదుపు తప్పిన అంబులెన్స్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న మోటార్‌సైకిళ్లపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఓ జంట అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నవంబ ర్1 రాత్రి సుమారు 11 గంటల సమయంలో బెంగళూరులోని రిచ్‌మండ్ సర్కిల్ వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. రెడ్ సిగ్నల్ పడటంతో పలువురు వాహనదారులు తమ బైక్‌లను ఆపి వేచి ఉన్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగం గా వచ్చిన ఓ అంబులెన్స్ అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లింది. ఒక స్కూటీని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. పోలీస్ అవుట్‌పోస్ట్‌ను ఢీకొట్టింది. ఆ స్కూటీపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు ఈ ప్రమాదంలో మరణించారు.
A speeding ambulance rammed into 3 bikes near Richmond Circle in Bengaluru last night, two people killed, others injured. The ambulance dragged a bike for nearly 50m before hitting a traffic police booth. Driver absconding; case filed. pic.twitter.com/n35AKSrmWH
— Deepak Bopanna (@dpkBopanna) November 2, 2025
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా.. కొద్దిసేపటికే భర్త.. ఆదివారం తెల్లవారుజామున భార్య ప్రాణాలు కోల్పోయారు. దంపతులను ఇస్మాయిల్ దబాపు (32), అతడి భార్య సమీనా బానుగా (29) గుర్తించారు. అలాగే, మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు పోలీసు ఔట్‌పోస్ట్‌పైకి దూసుకెళ్లిన అంబులెన్స్‌ను ఎత్తిపడేశారు. ఈ ఘటన అనంతరం డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు.
Also Read: దెయ్యాలతో ఆటాడుకున్న లాలూ ప్రసాద్ యాదవ్.. BJP విమర్శలు
ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంబులెన్స్ వాహనాన్ని స్థానికులు పైకి ఎత్తిపడేయడం కనిపించింది. ఈ నేపథ్యంలో అంబులెన్స్ దాడిలో దెబ్బతిన్న బైక్‌లు, పోలీస్ ఔట్ పోస్ట్ కనిపిస్తున్నా యి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న విల్సన్ గార్డెన్ పోలీస్ స్టేషన్ పోలీసులు అక్కడకు చేరు కుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదుచేసి ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ నుంచి పారిపోయిన అంబు లెన్స్ డ్రైవర్ అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతివేగంతో పాటు నిర్లక్ష్యంగా వాహనం నడపడమే ప్రమా దానికి కారణమని వారు ప్రాథమికంగా నిర్దారించారు. మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘ టనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్ డ్రైవర్ అశోక్‌ను అదుపులోకి తీసు కున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Also Read : నెల్లూరులో ఘోరం.. ముగ్గుర్ని మింగేసిన సముద్రం
Follow Us