యాదాద్రి పుణ్యక్షేత్రంలో కార్తికమాసం విశిష్టతను చాటి చెప్పే ఆధ్యాత్మిక పర్వాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు దేవస్థానం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. 5 రోజులపాటు సాగే ఈ కార్యక్రమాల్లో భాగంగా…ఈనెల 23వ తేదీని ఆలయ సన్నిధిలో కార్తికమాస విశిష్టతపై ప్రవచనం, 24వ తేదీన విష్ణు పుష్కరిణిలో దీపోత్సవం, 25వ తేదీని ఆలయ బ్రహ్మోత్సవ మండపం దగ్గర దీపోత్సవం, 26న సామూహిక హరినామ సంకీర్తనలు, 27న దామోదర వ్రత పర్వాలు జరుగుతాయని ఈవో తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం 5.30గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు పర్వాలు కొనసాగుతాయని ఈవో గీత వివరించారు. చివరిరోజు ప్రధాన ఆలయంలో అన్నకూటమి వేడుక నిర్వహించనున్నట్లు తెలిపారు.
అటు శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్ధానికి భక్తులు భారీ సంఖ్యలో కదిలి వస్తున్నారు. కలియుగ దైవం ఆరాధ్యదైవంగా పిలువబడే శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి ఆలయంలో కార్తీకమాసానన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు ఇతర రాష్ట్ర ప్రజలు కూడా అధిక సంఖ్యలో శ్రీశైలం వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. హిందూ సంప్రదాయ ప్రకారం ప్రతి గ్రామంలో ఈ కార్తిక మాసాన్ని ఎంతో భక్తితో ఉదయాన్నే తలస్నానం చేసి పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇంటి ముందు దీపరాధనలు ఏర్పాటు చేస్తారు. ఎంతో భక్తితో పరమశివుడిని పూజిస్తారు. అదేవిధంగా శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి దేవస్ధానంలో కార్తీక శోభ మొదలైంది.
ఉపవాసాలు, దీక్షలు, కార్తీకమాసంలో తీర్థయాత్రలు వెళ్లేవారు, మాలధారణ స్వీకరించేవారు, పుణ్య నది తీర ప్రాంతాల్లో, పవిత్రమైన స్నానాలు ఆచరించేవారు నోములు నోచుకునేవారు ఏదైనా మంచి పనిని ప్రారంభిచేవారు ఈ మాసం కోసం ఎదురుచూస్తుంటారు.
కార్తీక మాసంలో శివునికి మారేడు దళాలతో పూజిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్మకం. ఈ ఏడాది కార్తీక మాసం నవంబర్ 14 నుంచి ప్రారంభం అవుతుంది. మంగళవారం పాడ్యమి తో ప్రారంభం కాగా..బుధవారం భగినీ హస్త భోజనం. శుక్రవారం నాగుల చవితి, 20న కార్తీక మాస మొదటి సోమవారం.
నవంబర్ 27 న రెండవ కార్తీక సోమవారం కాగా…కార్తీక పౌర్ణమి. డిసెంబర్ 4 న కార్తీక మాసం మూడో సోమవారం. డిసెంబర్ 11 కార్తీక మాసం నాలుగో సోమవారం డిసెంబర్ 13 న కార్తీక మాసం ముగుస్తుంది. చలిగాలులు పెరిగే సమయం కాబట్టి ఈ మాసం లో పేదలకు , అనాథలకు స్వెట్టరలు, దుప్పట్లు వంటివి దానం చేస్తే శివకేశవుల అనుగ్రహం లభిస్తుందని పండితులు తెలుపుతున్నారు. దానధర్మాలు గోప్యగా చేసిన వాటికి ఎక్కువ ఫలితాలు ఉంటాయని పండితులు వివరిస్తున్నారు.
ఈ మాసంలో ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసానికి దూరంగా ఉండాలి. దీపారాధనలకు నువ్వుల నూనె మాత్రమే ఉపయోగించాలి. మినుములు తినకూడదు, నలుగు పెట్టుకుని స్నానం చేయకూడదు.
కార్తీక పురాణంలో కూడా మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుడి ప్రాముఖ్యతను, ఆఖరి 15 అధ్యాయాలు శ్రీహరి ప్రాధాన్యతను తెలియజేస్తాయి. కాబట్టి ఈ ఏడాది నవంబరు 14 మంగళవారం నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది. డిసెంబరు 13 బుధవారం పోలిస్వర్గంతో కార్తీకమాసం పూర్తవుతుంది.
ఇది కూడా చదవండి: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. వరుసగా మూడు రోజులు సెలవులు..!!