Yadagirigutta : యాదగిరిగుట్ట కు పోటెత్తిన భక్తులు...మూడు రోజులు సెలవులతో...

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శని,ఆదివారం సెలవుదినాలతో పాటు సోమవారం అంబేడ్కర్‌ జయంతి కూడా సెలవు ప్రకటించడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు దైవ దర్శానానికి తరలివచ్చారు.

New Update
Yadagirigutta

Yadagirigutta

Yadagirigutta : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వారంతపు సెలవులు కావడంతో గుట్గపై రద్దీ నెలకొంది. శని,ఆదివారం సెలవుదినాలతో పాటు సోమవారం అంబేడ్కర్‌ జయంతి కూడా సెలవు ప్రకటించడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు దైవ దర్శానానికి తరలివచ్చారు.

Also Read: కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

హైదరాబాద్‌తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వాహనాలపై తరలివచ్చారు. కొండకింద పార్కింగ్‌ ప్రదేశం వాహనాలతో నిండిపోయి వైకుంఠ ద్వారం ఇరువైపులా వాహనాలు పార్కింగ్‌ చేశారు. ఉభయ (ప్రత్యేక, ధర్మదర్శన) క్యూలైన్లు భక్తులతో ఉదయం నుంచే రద్దీగా ఉన్నాయి. వీఐపీ టికెట్‌ దర్శనానికి గంటన్నర, ధర్మదర్శనానికి రెండు గంట సమయం పడుతుందని భక్తులు తెలిపారు.

Also Read: DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్

మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో ఉదయం పూటే దర్శనానికి వెళ్లాలనే ఉద్ధేశంతో భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ప్రధానాలయం, ఉత్తర ప్రాకార మండపం, కొండకింద వ్రత మండపాలు, లక్ష్మీ పుష్కరిణి, అన్నప్రసాద సత్రం, బస్టాండ్‌, కొండపైన తిరువీధులు, బస్టాండ్‌, ప్రసా ద విక్రయశాలల్లో కూడా భక్తుల సందడి నెలకొంది. యాదగిరి గుట్ట దర్శనం అనంతరం సమీపంలో ఉన్న సురేంద్రపురి, స్వర్ణగిరి దేవాలయాలను కూడా సందర్శించానే ఉద్ధేశంతో భక్తులు పెద్ద సంఖ్యలో యాదాద్రికి చేరుకున్నారు.

Also Read: Trump: కేవలం 30 రోజులే..అమెరికాను విడిచి వెళ్లిపోండి...!

లక్ష్మీనృసింహుడికి శాస్త్రోక్తంగా నిత్య పూజలు

సుప్రభాత సేవతోస్వామి అమ్మవార్లను మేల్కొలిపిన అర్చకస్వాములు స్వయంభువులకు సంప్రదాయరీతిలో నిత్యపూజలు నిర్వహించారు. గర్భాలయంలో స్వయంభువులకు అభిషేకం, అర్చనలు, ప్రాకార మండపంలో హోమం, నిత్య కల్యాణోత్సవ పర్వాలు వైభవంగా చేపట్టారు. అనుబంధ ఆలయమైన పాతగుట్టలోనూ స్వామి, అమ్మవార్లకు నిత్య పూజలు ఘనంగా చేపట్టారు. శివాల యంలో శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారికి నిత్య పూజలు, రుద్రహవన పూజలు, శైవాగమరీతిలో జరిపారు. రాత్రి మహానివేదన, శయనోత్సవాలతో ఆయన ద్వారబంధనం చేశారు.

Also Read: 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు