BREAKING: చౌటుప్పల్‌లో ఘోర ప్రమాదం...ఒకరి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధి వలిగొండ రోడ్డు వద్ద భార్యాభర్తలు బైక్ పై రోడ్డు క్రాస్ చేస్తుండగా ఓ లారీ వచ్చి డీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్య నందిని మృతి చెందింది.

New Update
Accident

Accident

 Accident : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధి వలిగొండ రోడ్డు వద్ద భార్యాభర్తలు బైక్ పై రోడ్డు క్రాస్ చేస్తుండగా ఓ లారీ వచ్చి డీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్య నందిని అక్కడికక్కడే మృతి చెందింది, మృతురాలి స్వగ్రామం కొయ్యలగూడెంగా స్థానికులు గుర్తించారు. మరిన్నివివరాలు తెలియాల్సి ఉంది.
కాగా ఇదే చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం ..హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు డివైడర్ ను ఢీ కొట్టి విజయవాడ వైపు వెళ్తున్న కారుని ఢీకొట్టింది . ఈ కారులో పటాన్ చెరువు నుంచి సూర్యాపేటకు సాయి కుమార్ అనే వ్యక్తి తన అత్తగారి ఇంటికి భార్య, ఐదు నెలల కుమారుడు,తల్లిదండ్రులతో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. హైదరాబాదు వైపు వెళ్తున్న కారు బలంగా సూర్యాపేట వైపు వెళ్తున్న సాయికుమార్ కారును ఢీకొట్టడంతో ప్రమాద స్థలంలో ఇద్దరు మృతి చెందారు.
మృతులు సాయికుమార్ (33 ) తో పాటు ఐదు నెలల కుమారుడు వీరాన్ష్ ఉన్నారు. మృతుడి తల్లిదండ్రులతో పాటు భార్య కూడా తీవ్ర గాయాలు కావడంతో..హైదరాబాదులోని కామినేని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.హైదరాబాద్ వైపు వెళ్తున్న కారులో ప్రయాణిస్తున్న వారు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ నుంచి పరారైనట్లు తెలుస్తుంది. మృతులు సాయికుమార్, వీరాన్ష్ ను చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ మన్మధ కుమార్ తెలిపారు.
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు