Reactor Exploded : రియాక్టర్ పేలుడు..14 కు చేరిన మృతులు..ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ గోవన్ కూడా..
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాశమైలారంలోని సీగాచి కెమికల్స్ పరిశ్రమ లో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 14 మంది చనిపోగా.. మరో 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.