Tirupati : తిరుమలలో(Tirumala) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బుధవారం ఉదయం ఘాట్ రోడ్డు చివరిమలుపు దగ్గర ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. వేగంగా వస్తున్న బస్సు.. బైక్ ను ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బస్సు కింద ఇరుక్కుపోయిన మృతదేహాలను క్రేన్ సహాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కింది వైపుగా బస్సు వేగంగా వస్తుండడంతో మృతులు బస్సు కింద ఇరుక్కుపోయారు. ప్రమాదంలో మరణించిన వారిని తమిళనాడుకు (Tamilnadu) చెందిన దంపతులుగా గుర్తించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.
Also Read : హోంమంత్రి అనితతో వైఎస్ సునీత భేటీ
Also Read: Kadapa Crime : సెల్ ఫోన్ దొంగతనం.. సీనియర్ల నిందకు బలైన విద్యార్థిని..! – Rtvlive.com