/rtv/media/media_files/2025/05/21/Ay1JPFXDhWBzxZALpSos.jpg)
కర్ణాటక ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రెండు బైక్స్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడిని సబ్ ఇన్‌స్పెక్టర్ నాగరాజ్‌గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఆయన కుమార్తె కావ్య కూడా ఉన్నారు. ఈ సంఘటన ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కగ్గలిపుర పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కనకపుర నుండి బెంగళూరుకు వెళుతున్న బస్సు రెండు బైక్స్ పైకి దూసుకెళ్లి, రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది.
ఇది కూడా చూడండి: Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’
KSRTC Bus overturns at Kaggalipura turn:1 killed, 7 injured in a shocking road mishap
— Karnataka Portfolio (@karnatakaportf) May 20, 2025
In a tragic road accident that occurred near the Kaggalipura turn on the outskirts of Bengaluru, a KSRTC bus lost control and overturned, resulting in the death of one person and serious… pic.twitter.com/JUU2OG2b5m
ఇద్దరి పరిస్థితి విషమం
ఈ ఘటనలో బస్సుతో పాటు బైకులు కూడా కాలువలో పడిపోయాయి. గాయపడిన వారు ఐసియూలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బస్సు లోని ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన మరణానికి సంబంధించి కగ్గలిపుర పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ సమయంలో, స్టీరింగ్ కేబుల్ తెగిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ పేర్కొన్నాడు. కాగా వంపులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ లో రాహుల్ గాంధీ ట్రెండింగ్..వాడేసుకుంటున్న మీడియా..
rtc-bus | bus-accident | telugu-news