/rtv/media/media_files/2025/04/04/0cQ3cICAliAOdZsWYwRH.jpg)
ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యలమంచిలి మండలం పురుషోత్తపురం జంక్షన్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఏపీ ఆర్టీసీ బస్సుఅదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. తర్వాత కొబ్బరి చెట్టును ఢీకొని బోల్తాపడింది. ఆంద్రప్రదేశ్ ఆర్టీసీకి చెందిన అట్ట్రా లగ్జరీ బస్సు టెక్కలి నుంచి రాజమండ్రి వెళ్తోంది. ప్రమాద సమయంలో అందులో 22 మంది ప్రయాణీకులు ఉన్నారు.
Also read: Congress MLA CPR: కాంగ్రెస్ కార్యకర్తకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే (VIDEO)
అనకాపల్లి జిల్లాలో ఏపీఎస్ఆర్టీసీ బస్ బోల్తా..
— RTV (@RTVnewsnetwork) April 4, 2025
యలమంచిలి మండలం పురుషోత్తపురం జంక్షన్ జాతీయ రహదారిపై నుంచి పంట పొలాల్లోకి దూసుకెళ్లి,కొబ్బరి చెట్టును డీ కొని బోల్తాపడిన బస్సు.
ప్రమాద సమయంలో బస్సు 22 మంది ప్రయాణికులు. వారిలో ఆరుగురికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను అనకాపల్లి ఎన్.… pic.twitter.com/6O2Kc5BpmZ
Also read: Drugs: లేడీ కానిస్టేబుల్ కారులో డ్రగ్స్.. తర్వాత ఏం జరిగిందంటే?
వారిలో ఆరుగురు తీవ్ర గాయాలపాలైయ్యారు. మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను అనకాపల్లి ఎన్. టి.ఆర్ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులను విచారించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు.
Follow Us