/rtv/media/media_files/2025/04/20/msaPWAjZ6PmUA9xfjsVm.jpg)
Road Accident rtc bus
సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చింతలపాలెం వద్ద ఆర్టీసీ బస్సు స్టీరింగ్ విరిగి బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. బైక్‌ను తప్పించడానికి ట్రై చేస్తుండగా.. ఆర్టీసీ బస్సు స్టీరింగ్ రాడ్డు విరిగి అదుపు తప్పింది. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను స్థానికంగా ఉన్న యువకులు బయటకు తీశారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదం జరుగుతున్న సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు కోదాడ నుంచి చింతల పాలెం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇది కూడా చూడండి: Nishikant Dubey: సుప్రీం కోర్టుపై బీజేపీ ఎంపీ సంచలన కామెంట్స్.. ఊహించని షాక్ ఇచ్చిన జేపీనడ్డా!
భవనం కూలడంతో..
ఇదిలా ఉండగా ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోని ముస్తఫాబాద్‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. నిర్మాణంలో ఉన్న ఆ భవనం కూలిపోవడంతో అప్పటికి నలుగురు మరణించినట్లు తెలిసింది.
ఇది కూడా చూడండి: TG Crime: హైదరాబాద్‌లో దారుణం.. నడి రోడ్డుపై స్నేహితుడుని నరికిన యువకుడు
తాజాగా మృతుల సంఖ్య పెరిగింది. ముగ్గురు పిల్లలతో సహా మొత్తం 11 మంది మరణించినట్లు తెలిసింది. వీరితో పాటు మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో భవనం యజమాని తెహసీన్(60)తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఆయనతో పాటు మరో ఆరుగురు మరణించినట్లు సమాచారం.
ఇది కూడా చూడండి: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్..ఒక్క క్లిక్ చాలు!
కాగా కూలిన భవనం 20 ఏళ్ల నాటిదని అధికారులు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదానికి కారణం నిర్మాణ పనులే అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కింది అంతస్తులోని షాపుల్లో నిర్మాణ పనులు జరుగుతున్నాయని.. అవే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు.