CM Revanth Reddy: నిమమజ్జనం ఏర్పాట్లు, పర్యవేక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. దీనికి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హజరయ్యారు. వీరితో నిమజ్జనం ఏర్పాట్ల గురించి సీఎం చర్చించారు. వివరాలను అడగి తెలుసుకున్నారు. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 733 సీసీ కెమెరాలతో నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు సీఎం కు వివరించారు సీపీ. ట్యాంక్ బండ్ తో పాటు ప్రధాన మండపాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని రేవంత్ సూచించారు. పర్యవేక్షణతో పాటు ప్రతీ గంటకు ఒకసారి సిబ్బందికి కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలు ఇచ్చి అలెర్ట్ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని ఆయన సీపీ, ఉన్నతాధికారులను హెచ్చరించారు. బ్లైండ్ స్పాట్స్, హాట్ స్పాట్స్ లకు సంబంధించి రికార్డు మెయింటెన్ చేయాలని..ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
Revanth Reddy
Revanth Reddy : సీఎం పేషీలోకి డైనమిక్ ఆఫీసర్.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే!
Telangana : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పేషీలో స్వల్ప మార్పులు చేస్తున్నారు. తాజాగా మహిళా అధికారిణికి సీఎం కార్యాలయంలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రజావాణి నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న దివ్యరాజన్ కు ఆ అవకాశం దక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దివ్యరాజన్ 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. వివాద రహితురాలిగా, బెస్ట్ ఆఫీసర్ గా ఆమెకు పేరుంది. దీంతో ఆమెను తన పేషీలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ప్రజా దర్బార్ సక్సెస్ లో కీలకం..
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్‌ను ఆమె సమర్ధంగా నిర్వహించడంతో సీఎం దృష్టిని ఆకర్షించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ పేదరిక నిర్మూలనకు సంబంధించి ఆమె చేసిన కృషి కూడా సీఎంలో చోటు దక్కేందుకు మరో కారణమని సమాచారం. ప్రభుత్వం అమలు చేసే అనేక కార్యక్రమాల్లో మెజార్టీ లబ్ధిదారులు గ్రామాల్లోని ప్రజలే ఉంటారు.
ఈ నేపథ్యంలో ఆయా పథకాలను సమర్ధవంతంగా అమలు చేయడానికి దివ్యరాజన్ అనుభవం పనికి వస్తుందని సీఎం భావిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సీఎంఓలో పని చేస్తున్న అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అనుకున్నంత వేగంగా పనులు జరగకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. దీంతో ఇద్దరు అధికారులను సీఎంఓ నుంచి తొలగించనున్నట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దివ్యరాజన్ కు సీఎంఓలో చోటు దక్కనున్నట్లు చర్చ సాగుతోంది.
Also Read : బాణసంచా పేలుడుతో ఏడుగురికి తీవ్రగాయాలు!
Revanth Reddy: బీఆర్ఎస్ నేతల అరెస్ట్.. పోలీసులకు రేవంత్ సంచలన ఆదేశాలు!
Revanth Reddy: మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం నాడు ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరెకపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కౌశిక్ రెడ్డి ఇంటి వెలుపల జరిగిన గొడవ ,ఆ తరువాత జరిగిన అరెస్టులు వంటి పరిణామాల నేపథ్యంలో శుక్రవారం ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయకుండా ఈ మేరకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
మల్లారెడ్డి హౌస్ అరెస్ట్…
కోకాపేటలోని హరీష్ రావు నివాసంలో ఆయనను పోలీసులను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనను కలవడానికి వస్తున్న బీఆర్ఎస్ నేతలను కూడా ఎవరినీ అనుమతించడం లేదు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ శంభీపూర్ నివాసానికి బయలుదేరిన మల్లారెడ్డిని ఇంటి వద్దనే పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ నేతలను అరెస్టులు చేశారు. హైదరాబాద్ వెళ్లకుండా ముందస్తు అరెస్టులు మొదలు పెట్టారు. కరీంనగర్ నగర అధ్యక్షుడు హరి శంకర్, జగిత్యాల మాజీ జెడ్పీ చైర్మన్ భర్త సురేష్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ ప్రవీణ్‌లను ముందస్తుగానే అరెస్టులు చేశారు.
హరీష్ రావు ఆగ్రహం…
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని హరీష్ రావు అన్నారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ శ్రేణులను తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని వదిలేసి , బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టులు చేయడం కాంగ్రెస్‌పాలన అప్రజాస్వామికమని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేపై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ, వారి అనుచరులు, కాంగ్రెస్ గూండాలను అరెస్టు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
రేవంత్ సీరియస్..
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ , బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య జరిగిన మాటల యుద్ధం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గాంధీ ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ పిలుపునివ్వడం మరింత కలకలం రేపింది. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాలు, ప్రస్తుత పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో సీరియస్‌గా వ్యవహరించాలని డీజీపీకి రేవంత్ సూచించారు.
Telangana Women University : తెలంగాణ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు
Revanth Reddy : తెలంగాణలో ధీర వనిత ఐలమ్మ (Chakali Ilamma) స్పూర్తిని కొనసాగిస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పోరాటయోధురాలిని స్మరిస్తూ ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎం చెప్పారు. ఐలమ్మ కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలని భావిస్తున్నట్టు తెలిపారు. దాంతో పాటూ హైదరాబాద్ కోఠిలోని తెలంగాణ యూనివర్శిటీ (Telangana University) కి చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నామని అనౌన్స్ చేశారు. దొరల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాలను పేదలకు చేరాలని ఐలమ్మ పోరాటం చేశారంటూ వారిని స్మరించుకున్నారు. ఐలమ్మ స్పూర్తితో ఇందిరా గాంధీ దేశంలో భూ సంస్కరణలు తెచ్చారని, భూమి పేదవాడి ఆత్మగౌరవం, అందుకే ఇందిరమ్మ పేదలకు లక్షల ఎకరాలను పంచిపెట్టారని అన్నారు. ధరణి ముసుగులో కొందరు పేదల భూములను కాజేయాలన్న కుట్ర చేశారని, పేదల భూములను కాపాడేందుకే ఐలమ్మ స్పూర్తితో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సీఎం అన్నారు.
ఐలమ్మ 39 వ వర్థంతిని పురస్కరించుకుని ప్రభుత్వం రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్నారు. ఐలమ్మ జీవిత చరిత్రను నృత్య రూపకంగా ప్రదర్శించిన తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు డాక్టర్ అలేఖ్య పుంజాల బృందాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read: Skin Care: లోషన్లు, సన్‌స్క్రీన్, ఆయిల్స్ వల్ల పిల్లలో హార్మోన్ల లోపాలు
Hydra : రంగనాథ్‌కు మరో కీలక పదవి!
Ranganath : హైడ్రా (Hydra) చీఫ్ ఏవీ రంగనాథ్‌కు రేవంత్ సర్కార్ (Revanth Government) మరో కీలక బాధ్యత అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) కేంద్రంగా భూ కబ్జాదారుల గుండెల్లో గుబులు రేపుతున్న రంగనాథ్‌కు ప్రజలు, ప్రముఖుల నుంచి భారీ మద్దతు పెరగడంతో మరిన్ని బాధ్యతలు అప్పగించేందుకు సీఎం రేవంత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు హెచ్ఎండీఏ (HMDA) పరిధిలోని చెరువుల పరిరక్షణకోసం ఏర్పాటుచేసిన ‘లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ’ ఛైర్మన్‌గా రంగనాథ్ ను నియమించనున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తు తరాల కోసం చెరువులను పరిరక్షించాలని చెబుతున్న రేవంత్ రెడ్డి.. తను చేపట్టిన పనిని రంగానాథ్ ఆధ్వర్యంలో మరింత విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
7జిల్లాల్లో చెరువుల పరిరక్షణ..
ఈ మేరకు హెచ్ఎండీఏలోని 7జిల్లాల్లో చెరువుల పరిరక్షణను హైడ్రా కింద చేరిస్తే ఆక్రమణల నుంచి కాపాడవచ్చని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే హైడ్రాతోపాటు చెరువుల పరిరక్షణ కమిటీ బాధ్యతలను రంగనాథ్ కే ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ అంశానికి సంబంధించిన అధికారిక ప్రకనట త్వరలోనే వెల్లడించబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నవంబరు 1వరకు నోటిఫికేషన్లు జారీ..
ఇదిలా ఉంటే.. సోమవారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలో ఉన్న 7 జిల్లాల్లో చెరువుల సర్వే, ఎఫ్టీఎల్, నోటిఫికేషన్ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నవంబరు 1వరకు హెచ్ఎండీఏ పరిధిలోని అన్ని చెరువుల సర్వేతో పాటు ఎఫ్టీఎల్కు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Khammam Floods-Revanth Reddy: ఖమ్మంలో వరదలకు కారణం వారే.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
ఇక హెచ్ఎండీఏ పరిధిలో 3,500 చెరువులుండగా 265 చెరువులను నోటిఫై చేశారు. ఆగస్టు నుంచి ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయనుండగా మొదటి నోటిఫికేషన్ కోసం 50 చెరువులు తమ పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ చుట్టూ అవుటర్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న చెరువులు, కుంటలు, జలవనరుల ఎఫ్టీఎల్లు, బఫర్జోన్లలో అక్రమంగా నిర్మించిన ఇండ్లు, ఆఫీసులు, పలు నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే.
Khammam : వరద బాధితులకు రూ.10వేలు, పశువులకు రూ.50 వేలు.. రేవంత్ తక్షణ సాయం!
Revanth Reddy : ఖమ్మం (Khammam) వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధిత కుంటుంబాలకు తక్షణ సాయం కింద రూ.10వేలు అందిస్తామని చెప్పారు. ఆవు, గేదెలు మరణిస్తే రూ.50వేలు, గొర్రె, మేకలకు రూ.5వేలు ఇస్తామన్నారు. ఇళ్లకు నష్టం జరిగితే పీఎం ఆవాస్ యోజన (PM Awas Yojana) కింద ఆర్థికసాయం చేస్తామన్నారు. వరదల వల్ల ధ్రువపత్రాలు పోతే మళ్లీ ఇస్తామని తెలిపారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి రూ.10వేలు పరిహారం ఇస్తామని, విపత్తులు వచ్చినప్పుడు సాయం చేసేందుకు రాష్ట్రంలోని 8 ప్రాంతాల్లో విపత్తు బృందాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వరదల సమయంలో బురద రాజకీయాలు సరికాదని, ప్రతిపక్షాలు కూడా ప్రజలకు సాయం చేయాలని పిలుపునిచ్చారు.
ఫామ్ హౌజ్ లో ప్రశాంతంగా ఉండొచ్చు..
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలు వదలుకుని సాయం చేసేందుకు ముందుకురావాలి. ఒకవేళ మనకు సాయం చేయాలని లేకపోతే అన్ని మూసుకుని ఉండాలి. అంతేతప్పా పనులు చేస్తున్న వారిపై ఇంట్లో కూర్చొని బురదజల్లకూడదన్నారు. దేవుడు అలాంటి బుద్ధి మనకు ఇవ్వనప్పుడు ఫామ్ హౌజ్ లో ప్రశాంతంగా ఉండొచ్చు, లేదంటే విదేశాల్లో విలాసాలు చేయొచ్చు అంటూ కేసీఆర్, కేటీఆర్ (KTR) పై విమర్శులు గుప్పించారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఫామ్ హౌస్ లో మౌన ముద్ర వహించడం తనకు ఇప్పటికీ అర్థం కావట్లేదన్నారు. కేటీఆర్ ట్విట్టర్ లో మాత్రమే మాట్లాడుతాడని, అమెరికాలో లైఫ్ ఎంజాయ్ చేస్తూ ప్రజలల్లో ఉన్న మంత్రులను బద్నాం చేస్తున్నాడంటూ మండిపడ్డారు. విపత్కర పరిస్థితుల్లో అందంరం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కేంద్రం నుంచి నిధులు వచ్చే విషయంపై మాట్లాడాలన్నారు. కనీసం కష్టాల్లో ప్రజలను పలకరించే ప్రయత్నం చేయలేదన్నారు. మా ప్రభుత్వం కష్టాల్లో ప్రజలను ఆదుకుంటుందని, వాళ్లకు అండగా నిలబడుతుందని చెప్పారు.
పాపాలు కడుక్కోండి..
అలాగే సర్వం కోల్పోయిన ప్రజలను చూస్తే తనకు చాలా బాధేసిందని, వారికోసం ప్రత్యేకంగా 34 క్యాంపులు నిర్వహించి పనులు చేపట్టామన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చాడంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తెలంగాణ (Telangana) లో పదేళ్లు లక్ష కోట్ల రూపాయలు దోచుకున్న కేసీఆర్, కేటీఆర్, హారీష్ రావు కనీసం వెయ్యికోట్లు ఇచ్చినా పాపాలు కడుకున్నవారు అవుతారు కదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తామన్నారు.
Also Read : సింగ్‌నగర్‌లో ఆర్తనాదాలు.. ఆహారం లేక జనాల అవస్థలు