Chhaava Movie Teaser : బాలీవుడ్ లో మరో బయోపిక్ రాబోతుంది. ఈ బయోపిక్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన సైతం ప్రధాన పాత్ర పోషించింది. బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ టైటిల్ రోల్ లో నటిస్తున్నాడు. ఆ సినిమా పేరే ‘చావా’. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో మెప్పించనుంది.
తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. టీజర్లో వికీ కౌశల్ యుద్ధ వీరుడిగా అదరగొట్టారు. ఆయన యుద్ధ వీరతాన్ని, ధైర్యాన్ని తెరపై చూపించారు. రష్మిక మందన్నా కూడా తనదైన స్టైల్లో ఆకట్టుకున్నారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దివ్యంజలి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దినేష్ విజయన్ నిర్మిస్తున్నారు.
Also Read :కంగువా Vs వేట్టయాన్.. బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్న రజినీ, సూర్య..!
అక్షయ్ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 6న విడుదల కానుంది. గత ఏడాది రణ్ బీర్ కపూర్ సరసన నటించిన ‘యానిమల్’ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత రష్మిక నుంచి వస్తున్న బాలీవుడ్ ప్రాజెక్ట్ కావడంతో సౌత్ లోనూ ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి.