/rtv/media/media_files/2025/04/12/iF2GYoGKVvpgQo8c3P9V.jpg)
Rashmika Mandanna
Rashmika Mandanna: ఇంతకీ అసలు విషయమేమిటంటే... రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటిస్తున్న బాలీవుడ్ హారర్ ఎంటర్‌టైనర్ ‘థామా’ ప్రస్తుతం నైట్ షూట్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్నారు. రాత్రి సమయంలో జరిగే కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం యూనిట్ బిజీగా ఉంది. ఇంకొన్ని రోజులు ఈ నైట్ షూట్ కొనసాగనుండటంతో, రష్మిక తన ఇన్‌స్టాలో ఇది ప్రస్తావిస్తూ చమత్కరంగా పోస్టు చేసింది – “ఇప్పట్లో నా స్టోరీస్‌లో కనిపించేది చంద్రుడు, కెమెరా లైట్స్, ఆకాశంలో నక్షత్రాలే!” అంటూ రాసుకొచ్చింది.
Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!
హారర్ నేపథ్యంలో ‘థామా'
ఈ సినిమా విషయానికొస్తే, రష్మిక పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని టాక్. హారర్ నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా మిక్స్ అవ్వడం విశేషం. దీపావళి సందర్భంగా ఈ సినిమా విడుదల కానుండగా, భిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరించబోతుంది. ఇప్పటికే ఈ మూవీ పై అంచనాలు క్రియేట్ అయ్యాయి.
Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!
సాధారణ లవ్ స్టోరీలకే కాకుండా హారర్, యాక్షన్ సినిమాల్లోనూ తన టాలెంట్‌ను చూపించేందుకు సిద్ధంగా ఉన్న రష్మిక, ఈసారి తన కొత్త యాంగిల్‌ను ఫ్యాన్స్‌కు పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్
Also Read: ఫ్యాన్స్ కు మెగా ట్రీట్.. 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.