Rashmika - Vijay Devarakonda: ‘విజ్జూ మాటిస్తున్నా.. నువ్వు గర్వపడేలా చేస్తా’ విజయ్‌ దేవరకొండకు రష్మిక ప్రామిస్‌

రష్మిక-విజయ్ మధ్య ఇన్‌స్టాగ్రామ్ పోస్టు వైరల్‌గా మారింది. ‘మైసా మూవీ అద్భుతంగా ఉండనుంది’ అని విజయ్‌ ఓ పోస్టు పెట్టాడు. దీన్ని రీషేర్‌ చేసిన రష్మిక ‘‘విజ్జూ ఈ సినిమాతో నేను నిన్ను గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నా’’ అని ఒక హార్ట్‌ ఎమోజీని పెట్టింది.

New Update
Rashmika mandanna promise to vijay devarakonda mysaa movie

Rashmika mandanna promise to vijay devarakonda mysaa movie

‘లైగర్’ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొన్ని ఏళ్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరూ ‘గీతా గోవిందం’ సినిమా నుంచి ప్రేమ వ్యవహారం సాగిస్తున్నారని నెట్టింట టాక్ గట్టిగా నడుస్తోంది. కానీ ఈ జంట ఎప్పుడూ తమ రిలేషన్‌పై మాట్లాడలేదు. 

Also Read: భారీ వరదలు.. వందల మంది గల్లంతు.. ఒకే కుటుంబంలో 18మంది!

విజ్జూ మాటిస్తున్నా

కానీ వీరిద్దరికీ సంబంధించిన ఫొటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇద్దరూ కలిసి వెకేషన్‌కు వెళ్లడం.. విజయ్ ఫ్యామిలీతో కలిసి రష్మిక టూర్‌లకు వెళ్లడం అక్కడ దిగిన ఫొటోలు చక్కర్లు కొట్టడం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి వీరి రిలేషన్ గురించి ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. 

A screengrab of Rashmika Mandanna's Instragram stories.

Also Read: కోల్‌కతా గ్యాంగ్‌ రేప్‌ ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు

రష్మిక ‘కుబేర’తో మంచి క్రేజ్ అందుకుంది. ఈ క్రమంలోనే ఆమె ‘మైసా’ అనే పవర్ ఫుల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మూవీ నుంచి తాజాగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాగా.. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందులో రష్మిక ఒక ఖడ్గం పట్టుకుని.. ముఖం నిండా రక్తంతో కనిపించిన లుక్ అందరినీ అట్రాక్ట్ చేసింది. 

Also Read :  జపాన్‌లో ‘ట్విటర్‌ కిల్లర్‌’ కు ఉరి

ఈ లుక్‌కు సినీ అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. ఇదే లుక్‌పై విజయ్ సైతం ప్రసంసలు కురిపించాడు. ‘ఇది అద్భుతంగా ఉండనుంది’ అంటూ తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దీనికి రిప్లై ఇచ్చిన రష్మిక పోస్టు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ‘‘విజ్జూ మాటిస్తున్నా.. నేను ఈ సినిమాతో నిన్ను గర్వపడేలా చేస్తాను.’’ అనే క్యాప్షన్ పెట్టి ఒక లవ్ ఎమోజీ పెట్టింది. ఇక ఈ పోస్టులో రష్మిక విజయ్‌ను విజ్జూ అని పిలవడంతో మరోసారి ఈ జంట రిలేషన్ హాట్ టాపిక్‌గా మారింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు