Rashmika Mandanna : ప్రమోషన్స్‌లో నోరు జారింది.. మరో వివాదంలో నేషనల్ క్రష్ !

రష్మిక మందన్న మరో వివాదంలో చిక్కుకుంది. ఛావా ప్రమోషన్స్‌లో భాగంగా తాను హైదరాబాద్‌ నుంచి వచ్చానని చెప్పుకొచ్చింది రష్మిక. ఈ విషయంలో ఆమెపై కన్నడ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంతూరు గురించి చెప్పకపోవడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు.

New Update
Trolling on Rashmika Mandanna

Rashmika Mandanna: కన్నడ బ్యూటీ రష్మిక మందన్న మరో వివాదంలో చిక్కుకుంది.  ఛావా ప్రమోషన్స్‌(Chaava Movie Promotions)లో భాగంగా తాను హైదరాబాద్‌(Hyderabad) నుంచి వచ్చానని చెప్పుకొచ్చింది రష్మిక. దీనిపై ఆమెపై కన్నడ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు.  సొంతూరు గురించి చెప్పకపోవడాన్ని నెటిజన్లు సోషల్ మీడియాలో తప్పుపడుతున్నారు.  కర్ణాటకకు(Karnataka) చెందిన రష్మిక ఎప్పుడు హైదరాబాదీ అయిందో  చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.  కన్నడలో ఆమె సినిమాలు చేయకపోవడం పట్ల కూడా కన్నడ వాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read:  Tariffs: ట్రంప్ టారీఫ్ లతో భారత్ కు నష్టమా...లాభమా?

Also Read: ఆ విషయంలో భర్త బలవంతం చేసినా తప్పుకాదు: హైకోర్టు

అయితే రష్మిక ఫ్యాన్స్ మాత్రం ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. రష్మిక ఎప్పుడూ కూడా తన జన్మ స్థానం గురించి, కూర్గ్ గురించి చెబుతూనే ఉంటుందని పాత వీడియోలను షేర్ చేస్తున్నారు.  హీరోయిన్ గా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఎంట్రీ ఇచ్చిన రష్మిక తెలుగు సినిమాలతో బాగా పాపులర్ అయింది. యానిమల్, పుష్ప చిత్రాలతో బాలీవుడ్ లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. దీంతో ఇండస్ట్రీని లైట్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది.

బాలీవుడ్‌లో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్

మరోవైపు హీరో విక్కీ కౌశల్(Bollywood Vicky Kaushal) శంభాజీగా..రష్మిక(Rashmika Mandanna) అతని భార్యగా ప్రధాన పాత్రల్లో నటించిన ఛావా సినిమా ఈ ఏడాదిలో బాలీవుడ్‌లో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ప్రీ సేల్‌ బుకింగ్స్‌లోనే 5 లక్షల టికెట్స్‌ బుక్ అవ్వగా..మొదటిరోజు రూ.31 కోట్లు వసూలుచేసినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Also Read :  USA: ఎలాన్ మస్క్ నా బిడ్డకు తండ్రి..రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్

Also Read :  Tamilanadu: ఒక్క నిమ్మకాయ అక్షరాలా రూ.6 లక్షలు.. అందులో ఏమంతా స్పెషల్‌ ఉందబ్బా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు