Bollywood Actor Ranbir Kapoor : బాలీవుడ్ ప్రేమ జంట రణ్బీర్ కపూర్ మరియు ఆలియా భట్ మధ్య వయసు తేడా గురించి రణ్ బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రణ్బీర్, ఆలియాతో తనకున్న అనుబంధం, వారి మధ్య ఉన్న వయసు తేడా గురించి మాట్లాడారు. ఈ మేరకు రణ్ బీర్ మాట్లాడుతూ..”నేను నాకెంతో ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. ఈ విషయంలో చాలా అదృష్టవంతుడిని. ఆలియా నా బెస్ట్ ఫ్రెండ్.
మేమెంతో సరదాగా ఉంటాం. ఆమె నాకంటే 11 ఏళ్లు చిన్నది. ఈ విషయం తలచుకుంటే నవ్వొస్తుంది. నేను ఆమెను మొదటిసారి చూసినప్పుడు ఆమెకు కేవలం 9 ఏళ్లు, అలాగే నాకు 20 ఏళ్ళు. అయితే, కాలక్రమంలో మా మధ్య అభిమానం పెరిగి, ప్రేమగా మారింది” అని చెప్పారు.అంతేకాకుండా..” నేను ఎన్నో ఏళ్లుగా ఆమెను చూస్తున్నాను. అందరిలాంటి వ్యక్తికాదు. ఒక నటిగా, కళాకారిణి, కుమార్తె, సోదరి, భార్య, తల్లిగా అన్ని బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తుంటుంది.
Also Read : వాళ్ళ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ‘కల్కి’ టీమ్.. లీక్ చేసిన అమితాబ్, పోస్ట్ వైరల్!
ఆమెపై నాకు అపారమైన గౌరవముంది. తనతో కలిసి విహారయాత్రలకు వెళ్లడం నాకు ఇష్టం. నేనెప్పుడూ సంతోషంగా ఉండేలా చూస్తుంది. మా మధ్య ఉన్న వయసు తేడా కంటే అనుబంధమే ముఖ్యం. నేను అలియాతో చాలా సంతోషంగా ఉన్నాను” అని తెలిపారు. దీంతో రణ్ బీర్ కపూర్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవ్వడంతో ఈ జంట మధ్య ఏకంగా 11 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.