/rtv/media/media_files/2025/04/20/z52dHdv7UYeFFfDEFyHp.jpg)
Yash Ramayana
Yash Ramayana: పాన్ ఇండియా స్టార్ యశ్ ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. అందులో ఒకటి 'టాక్సిక్' కాగా, మరొకటి 'రామాయణ'. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read: “ఓదెల 2” ఫస్ట్ డే కలెక్షన్స్ తుస్.. విజువల్స్ ఎక్కువ విషయం తక్కువ..!
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), సీతగా సాయిపల్లవి(Sai Pallavi) నటిస్తుండగా, కీలకమైన రావణుడు పాత్రలో యశ్ కనిపించనున్నారు. ప్రస్తుతం మొదటి భాగం చిత్రీకరణ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో, రెండో భాగానికి సంబంధించిన విశేషాలు బయటకు వచ్చాయి.
Also Read: 'రాబిన్ హుడ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
మే నెలాఖరు నుంచి షూటింగ్
తాజా సమాచారం ప్రకారం, ‘రామాయణ: పార్ట్ 2’ షూటింగ్ ఈ సంవత్సరం మే నెలాఖరు నుంచి ప్రారంభం కానుంది. మొదటి షెడ్యూల్ లో అశోకవనం ఎపిసోడ్స్‌ను చిత్రీకరించనుండగా, జూన్ నుంచి రణ్‌బీర్ పై రాముని పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఫ్యాన్స్ మీట్‌లో షాకింగ్ డెసిషన్ బయటపెట్టిన సూర్య..
అంతేకాకుండా, సీతా రాముల మధ్య అనుబంధాన్ని చూపించే రెండు పాటలు కూడా ఈ షెడ్యూల్‌లోనే తెరకెక్కించనున్నారు. తొలి భాగం వచ్చే సంవత్సరం దీపావళి (2026) సందర్భంగా విడుదల కానుండగా, రెండో భాగం విడుదలను 2027 దీపావళికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
Also Read: అరేయ్ ఏంట్రా ఇది.. సడన్‌గా చూసి నిజం అనుకున్నాం కదరా బాబు..
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో బారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.