Animal : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. ఇలా షాకిచ్చాడేంటి? సందీప్ రెడ్డి వంగా రీసెంట్ గా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. యానిమల్ సినిమా సమయంలో స్టైలిష్ హెయిర్ లుక్‌తో కనిపించిన సందీప్ రెడ్డి, ఒక్కసారిగా గుండు కొట్టించుకుని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించారు సందీప్. By Web Dev 07 Mar 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Sandeep Reddy : గతేడాది యానిమల్(Animal) తో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga). రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), రష్మిక మందన్నా(Rashmika Mandanna) జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. యానిమల్ సూపర్ హిట్ తర్వాత, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది చివర్లో వీరిద్దరి కాంబోలో రానున్న స్పిరిట్ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.అయితే ఎప్పుడు స్టైలిష్ హెయిర్ లుక్ తో కనిపించే సందీప్ వంగా, ఫ్యాన్స్ కు షాకిచ్చాడు. సందీప్ రెడ్డి వంగా రీసెంట్ గా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. యానిమల్ సినిమా సమయంలో స్టైలిష్ హెయిర్ లుక్(Stylish Hair Look) తో కనిపించిన సందీప్ రెడ్డి, ఒక్కసారిగా గుండు కొట్టించుకుని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన సందీప్ రెడ్డి, గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. యానిమల్ సూపర్ హిట్ కావడంతోనే మొక్కులు చెల్లించుకున్నట్లు తెలుస్తోంది. ఇక సందీవ్ వంగా ప్రస్తుతం ప్రభాస్ తో తీయబోయే, స్పిరిట్ సినిమా స్టోరీ పనుల్లో బిజీగా ఉన్నాడు. Also Read : తిరుమలలో జాన్వీ కపూర్.. ఆమె వెంట ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా! #rashmika-mandanna #animal #sandeep-reddy-vanga #ranbir-kapoor మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి