Committee Kurrollu: సినీ పరిశ్రమలో కంటెంట్ ఉన్న సినిమాలకు ఏ డోకా ఉండదు. కథలో బాగుంటే చిన్న సినిమానా..? పెద్ద సినిమానా..? అని తేడా లేకుండా ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. ఇక ఇటీవలే విడుదలైన ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమాతో ఈ విషయం మరో సారి రుజువైంది.
‘కమిటీ కుర్రాళ్ళు’
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా విడుదలైన ‘కమిటీ కుర్రాళ్ళు’ చిత్రం విశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటోంది. డీసెంట్ బజ్ తో ఆగస్టు 9న వచ్చిన ఈ చిత్రం సాలిడ్ టాక్ అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విధంగా వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే రెండు వారాల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకొని విజయవంతంగా మూడవ వారంలో అడుగుపెట్టింది.
‘కమిటీ కుర్రాళ్ళ’ కలెక్షన్ల జోరు
రెండు వారాల్లోనే ఈ సినిమా 15.6 కోట్ల గ్రాస్ ను రాబట్టి అదరగొట్టింది. అదే జోష్ మూడువ వారంలోనూ దూసుకెళ్తుంది. మూడో వారంలో ఈ చిత్రానికి మరిన్ని స్క్రీన్స్ యాడ్ చేస్తుండగా.. వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో విడుదలైన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ వంటి పెద్ద సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోవడం ఈ సినిమాకు ప్లస్ గా మారిందనే చెప్పొచ్చు.
యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాధ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వీ రావు, టీనా శ్రావ్య, విశిక, షణ్ముఖి నాగుమంత్రీ, సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటించారు.
Also Read: Raviteja: హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రవితేజ – Rtvlive.com