/rtv/media/media_files/2025/06/05/PT4zv57T0V07ftVlnKYS.jpg)
Niharika Konidela
Niharika Konidela : మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెర ద్వారా సినిమా రంగానికి పరిచయం అయిన నిహారిక పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని చిత్రాల్లోనూ నటించింది. తెలుగుతో పాటు ఇతర భాష సినిమాల్లోనూ నటించిన అంతగా గుర్తింపు రాలేదు. దీంతోపాటు పెళ్లి కూడా ఆమెకు కలిసిరాలేదు. జొన్నలగడ్డ చైతన్య అనే యువకున్ని పెళ్లి చేసుకున్న నిహారిక కొంతకాలం కాపురం కూడా చేసింది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఇద్దరూ విడిపోయారు. ఈ విషయం అప్పుడు సంచలనంగా మారింది. అయితే ఆ తర్వాత నిహారిక ఎవరితోనో రిలేషన్‌లో ఉందన్న ప్రచారం సాగింది. కానీ అదేం కాలేదు. చివరికి మళ్లా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. తన సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి కమిటీ ‘కమిటీ కుర్రోళ్లు’ పేరుతో సినిమాను నిర్మించింది. ఈ సినిమా విజయవంతంగా నడిచింది.
Also Read: కొండగట్టు వద్ద రోడ్డు ప్రమాదం.. చిన్నారి మృతి, వరుడికి గాయాలు
‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టడంతో పాటు పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో చిన్న పాత్రలో నటించిన నిహారిక మరి కొన్ని చిత్రాల్లోనూ నటించింది కానీ హిట్ అందుకోలేకపోయింది.
Also Read: కరోనా వైరస్.. ఇప్పుడు కొత్త ఫంగస్.. చైనా రోగాల ఫ్యాక్టరీ గురించి తెలుసా..?
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మరో సినిమాను నిర్మిస్తున్న నిహారిక సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో తన నిర్మాణ సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ముందు ముందు మరిన్ని సినిమాలు నిర్మించాలనుకుంటుందట. దీనికోసం తన నిర్మాణ సంస్థలో చండీ హోమం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక అది చూసిన నెటిజన్లు అసలు ఆమె హోమం చేయడానికి కారణం ఏంటీ.. ఈ సమయంలో ఎందుకు చేసిందని నెట్టింట పలు చర్చలు జరుగుతున్నాయి. అయితే తను నిర్మించే చిత్రాలు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వగ్నంగా కొనసాగడానికి యాగం చేస్తుందని తెలిపారు.
Also Read: కరోనా వైరస్.. ఇప్పుడు కొత్త ఫంగస్.. చైనా రోగాల ఫ్యాక్టరీ గురించి తెలుసా..?