Niharika Konidela: నిన్ను అత్యంత ప్రేమిస్తున్నాను.. నిహారిక ఎమోష‌న‌ల్ పోస్ట్ ఎవ‌రి గురించో తెలుసా!

మెగాడాటర్ నిహారిక కొనిదెల సోషల్‌ మీడియాలో చేసిన ఓ పోస్టు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.అందులో ఆమె నేనునిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటూ రాసుకురావడం ఆసక్తిగా మారింది.ఆమె ఎవరి గురించి ఈ వ్యాఖ్యలు చేసిందో ఈ కథనంలో..

New Update
Niharika : ఈ పోస్ట్‌ కి అర్థం ఏంటి.. నిహారిక మళ్లీ ప్రేమలో పడిందా?

Niharika Konidela Photograph: (Niharika Konidela)

మెగా డాటర్‌ నిహారిక గురించి ప‌రిచ‌యం అవసరం లేదు. యాంక‌ర్‌గా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన నిహారిక ఆ త‌ర్వాత ప‌లు సినిమాల‌లో కూడా యాక్ట్‌ చేసింది అయితే నిహారిక న‌టించిన సినిమాలు పెద్దగా సక్సెస్‌ ను అందుకోలేదు. ఒక మనసు చిత్రం ద్వారా వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. అనంతరం హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నర్సింహారెడ్డి సినిమాలలో నటించింది. ఈ సినిమాలేవి నిహారికకి క‌లిసి రాలేదు. ఇక ఆ తరువాత 2020 డిసెంబర్‌లో పెళ్లిచేసుకుంది. కానీ  కొన్నాళ్లకే వారు విడిపోయారు.

Also Read:  Horoscope Today: నేడు ఈ రాశివారికి అసలు బాలేదు..కాస్త జాగ్రత్తగా ఉండండి!

ఇక విడాకుల త‌ర్వాత నిహారిక నటిగా ప్రేక్షకులను ఓవైపు అలరిస్తూనే మరోవైపు ప్రొడ్యూసర్ గాను గుర్తుండిపోయే చిత్రాలను తీస్తుంది. అయితే నిహారిక సోషల్ మీడియాలోనూ, పలు ఇంటర్వ్యూలోను తన పర్సనల్ విషయాలను నిర్మొహ‌మాటంగా చెబుతూ ఉంటుంది.

Also Read: Elan Musk: ఎక్స్‌ సేవల్లో అంతరాయం..ఇది భారీ సైబర్‌ దాడే అంటున్న మస్క్‌!

రీసెంట్‌గా నిహారిక తన డివోర్స్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.ఏ ఒక్కరు కూడా డివోర్స్ తీసుకోవాలనే ఆలోచనతో పెళ్లి చేసుకోరు అని నిహారిక చెప్పింది. కొన్ని కఠిన నిర్ణయాలు మ‌న‌ల్ని బ‌ల‌వంతం చేస్తాయి. విడాకులు అనేది జీవితంలో క‌ష్ట‌మైన డెసిష‌న్. అది కావాల‌ని ఎవ‌రు తీసుకోరు అని నిహారిక అంది. ఇక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నిహారిక త‌న ఇన్‌స్టా పోస్ట్‌లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ చేసింది.

నా పార్ట్ టైమ్ అమ్మ‌, ఫుల్ టైమ్ అక్క...

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత పుట్టినరోజు సంద‌ర్భంగా నిహారిక త‌న ఇన్‌స్టాలో సుస్మిత‌తో దిగిన ఫోటో షేర్ చేస్తూ.. నా పార్ట్ టైమ్ అమ్మ‌, ఫుల్ టైమ్ అక్క అండ్ ఆల్ టైమ్ బెస్ట్ ఫ్రెండ్ నీకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు.. నిన్ను అత్యంత ప్రేమిస్తున్నాను అంటూ నిహారిక త‌న పోస్ట్ల్ లో పేర్కొంది. నిహారిక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. 

Also Read:  Syria: సిరియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. అంతర్యుద్ధానికి కారణం ఏంటి ?

Also Read: Champions Trophy 2025: ఛాంపియన్లకు ‘వైట్ జాకెట్’.. ఇంత ప్రాధాన్యత ఉందా?

#telugu-news #Latest News #susmitha-konidela #niharika-konidela #mega-daughter #latest-telugu-news #latest telugu news updates
Advertisment
Advertisment
తాజా కథనాలు