Kangana Ranaut Emergency Movie : బాలీవుడ్ అగ్ర హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా, 1975-77 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో రూపొందిన ఈ మూవీకి రిలీజ్ కష్టాలు ఎదురయ్యాయి. కంగనారనౌత్ ఇందిరాగాంధీ పాత్రను పోషిస్తూ స్వయంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 6న రిలీజ్ కావాల్సి ఉంది.
అయితే సినిమాలో ఓ వర్గం మనోభావాలను కించపరిచారని, ఆపరేషన్ బ్లూస్టార్ నేపథ్యంలో మతపరంగా సున్నితమైన అంశాలు ఇందులో ఉన్నాయని పేర్కొంటూ కేంద్ర సెన్సార్ బోర్డ్ రిలీజ్ వాయిదా వేయాలని నిర్మాతలను ఆదేశించింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఢిల్లీ సిక్కు గురుద్వార మేనేజ్మెంట్ కమిటీ కేంద్ర సెన్సార్ బోర్డ్‌కు లేఖ రాసింది.
Also Read : డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బాలీవుడ్ యాక్షన్ మూవీలో ప్రభాస్ గెస్ట్ రోల్..?
ఈ సినిమా ట్రైలర్లో తమ వర్గంపై అనుమానం రేకెత్తించేలా సున్నితమైన అంశాలను ప్రస్తావించారని, అవాస్తవాలను చూపించారని గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో చిత్ర విడుదలను వాయిదా వేశారు.