Emergency: విడుదలకు బాధ్యత వహించండి.. సెన్సార్ కు కంగనా విజ్ఞప్తి!

కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' వివాదాల్లో చిక్కుకుంది. సినిమాలోని కొన్ని సీన్స్ పై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో సెన్సార్ బోర్డు విడుదలకు అనుమతించలేదు. దీంతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా విడుదలకు సెన్సార్ బోర్డు బాధ్యత తీసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

New Update
kangana ranaut

kangana ranaut

Emergency Movie: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఎమర్జెన్సీ'. మాజీ భారత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో కంగనా ఇందిరాగాంధీ పాత్రను పోషించింది. 'ఎమర్జెన్సీ' సమయంలో దేశంలో చోటు చేసుకున్న సంఘటనలు, అప్పుడు ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలను ఈ మూవీలో చిత్రీకరించారు. అయితే  ఈ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. సినిమాలోని కొన్ని సన్నివేశాలు సిక్కు మతస్థుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆ సంఘానికి సంబందించిన నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా విడుదల నిలిపివేయాలని కోర్టును కోరారు. 

Also Read:Emergency Trailer: కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' ట్రైలర్..! - Rtvlive.com

సెన్సార్ బోర్డుకు కంగనా విజ్ఞప్తి 

సినిమా పై పలు అభ్యంతరాలు వ్యక్తం కావడంతో సెన్సార్ బోర్డు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయలేదు. దీంతో ఎమర్జెన్సీ విడుదల ఆగిపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా..  'ఎమర్జెన్సీ' సినిమాపై పరిశ్రమ మౌనం వహించడం పట్ల తన నిరాశను వ్యక్తం చేసింది. తాను సినిమా చేసినప్పటికీ పరిశ్రమ నుంచి ఎలాంటి సపోర్ట్ రాలేదని. ఇతర నిర్మాతల సహాయంతో ఈ చిత్రాన్ని నిర్మించానని వాపోయింది. విడుదల ఆలస్యం అందరినీ బాధపెడుతోందని. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని విడుదల చేసే బాధ్యత సెన్సార్ బోర్డు తీసుకోవాలని భావిస్తున్నట్లు కంగనా ఆశాభావం వ్యక్తం చేసింది.

జీ స్టూడియోస్ & మణికర్ణిక ఫిల్మ్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కంగనా రనౌత్, రేణు పిట్టి, ఉమేష్ Kr బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మిలింద్ సోమన్, మహిమా చౌదరి, విశాక్ నాయర్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే, జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌ నటించారు. మహిమా చౌదరి, మిలింద్‌ సోమన్‌, తదితరులు కీలక పాత్రల్లో పోషించారు. 

Also Read: Emergency : చిక్కుల్లో కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ'.. విడుదల ఆపేయాలని ఎంపీ లేఖ

Advertisment
తాజా కథనాలు