/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-33-1.jpg)
Emergency
Emergency Movie: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఎమర్జెన్సీ'. మాజీ భారత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ మూవీలో కంగనా రనౌత్ ఇందిరాగాంధీ పాత్రను పోషించింది. ఎమర్జెన్సీ పీరియడ్.. 1975-1977 సమయంలో దేశంలో చోటు చేసుకున్న పరిమాణాలు, ఆ సమయంలో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలను మూవీలో చూపించారు.
హైకోర్టులో పిటీషన్
అయితే ఈ మూవీ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ట్రైలర్ లోని కొన్ని సన్నివేశాల్లో సిక్కులను తప్పుగా చూపించారని.. ఆ సంఘం నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మూవీ విడుదలను నిలిపివేయాలని బాంబే హై కోర్టులో పిటీషన్ వేశారు. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సినిమాకు సెన్సార్ సిర్టిఫికెట్ జారీ చేయకపోవడంతో.. విడుదల ఆగిపోయింది.
ఎమర్జెన్సీ విడుదలకు గ్రీన్ సిగ్నల్
'ఎమర్జెన్సీ' విడుదల నిలిపివేయాలనే పిటీషన్ పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు.. తాజాగా విడుదలకు అనుమతిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కొన్ని కట్స్ తర్వాత మూవీని రిలీజ్ చేయవచ్చని తెలిపింది.
#BREAKING: Bombay High Court hears plea of BJP MP and actor Kangana Ranaut's 'Emergency'
— NDTV (@ndtv) September 26, 2024
- Central Board of Film Certification (CBFC) says film can be released after cuts
- ZEE to court: Need time till Monday to decide
జీ స్టూడియోస్ & మణికర్ణిక ఫిల్మ్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కంగనా రనౌత్, రేణు పిట్టి, ఉమేష్ Kr బన్సాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మిలింద్ సోమన్, మహిమా చౌదరి, విశాక్ నాయర్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే, జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్ నటించారు. మహిమా చౌదరి, మిలింద్ సోమన్, తదితరులు కీలక పాత్రల్లో పోషించారు.