కంగనా రనౌత్‌కు బిగ్ షాక్.. కోర్టు నోటీసులు బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు మరోసారి షాక్ తగిలింది. గతంలో ఆమె రైతులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 27న పత్రికల్లో వచ్చిన కంగనా వ్యాఖ్యల ఆధారంగా ఆమెపై కేసు నమోదైంది. By B Aravind 12 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు మరోసారి షాక్ తగిలింది. గతంలో ఆమె రైతులపై అవమానకర వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆగ్రాలోని రాజీవ్‌గాంధీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామశంకర్ శర్మ, సీనియర్ న్యాయవాది ఈ ఏడాది సెప్టెంబర్ 11న ఈ అంశంపై కేసు పెట్టారు. ఆగస్టు 27న పత్రికల్లో వచ్చిన కంగనా వ్యాఖ్యల ఆధారంగా ఆయన కేసు నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన నిరసనలపై ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. Also Read: కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం.. ఎమ్మెల్యే పదవి కూడా పోతుందా? మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే దేశంలో బంగ్లాదేశ్ తరహా అశాంతి పరిస్థితులకు దారితీసే ఛాన్స్ ఉండేదని కంగనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అలాగే రైతులు చేసిన ఈ పోరాటంలో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని, లైంగిక దాడులు జరిగాయని, రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నా కూడా నిరసనలు జరిగేలా విదేశీ శక్తులు, స్వార్థ ప్రయోజనాల కోసం ఆశించేవారే ఈ నిరసనలను ప్రోత్సహించారని అన్నారు. బంగ్లాదేశ్‌లో ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమవ్వడంతో చివరికీ బీజేపీ నేతలు కూడా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: కలెక్టర్ పై దాడి కేసులో కేటీఆర్, ఆ కీలక నేత హస్తం.. విచారణలో సంచలనాలు? మరోవైపు కంగనా రనౌత్ దేశంలో ఉన్న కోట్లాదిమంది రైతులను అవమానపరిచేలా వ్యాఖ్యానించారని రామశంకర్ ఆరోపణలు చేశారు. కంగనా రైతులను రేపిస్టులు, హంతకులు, తీవ్రవాదులతో పోల్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కూడా ఓ రైతు కొడుకునేనని, వ్యవసాయం కూడా చేశానని తెలిపారు. ఆమె చేసిన వ్యాఖ్యలు రైతుల మనోభావాలను దెబ్బతీశాయన్నారు. పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది రామశంకర్ శర్మతో పాటు గ్రేటర్ ఆగ్రా బార్ ప్రెసిడెంట్ సీనియర్ న్యాయవాది దుర్గ్ విజయ్ సింగ్ భయ్యా, రామ్‌దత్ దివాకర్ తదితరులు వాదనలు వినిపించారు. ఈ మేరకు వాదనలు విన్న ప్రత్యేక న్యాయస్థానం కంగనా రనౌత్ వ్యక్తిగతంగా హాజరై ఈ నెల 28న తన పక్షాన్ని హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. #telugu-news #national #kangana-ranaut మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి