''నన్ను క్షమించండి'' రైతు చట్టాల వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన కంగనా

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ ఇటీవల రైతు చట్టాలను మళ్లీ తీసుకురావాలని చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమేనని పార్టీకి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎవరైనా నిరాశకు గురైతే క్షమాపణలు తెలియజేస్తున్నాని చెప్పారు.

author-image
By B Aravind
New Update
Kangana Ranaut

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ ఇటీవల రైతు చట్టాలను మళ్లీ తీసుకురావాలని చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమేనని.. పార్టీకి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో వీడియో సందేశాన్ని వెల్లడించారు. '' గత కొన్ని రోజుల క్రితం రైతు చట్టాలపై మీడియా నన్ను ప్రశ్నించింది. రైతులు మరోసారి రైతు చట్టాలను వెనక్కి తీసుకురావాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయాలని సూచించాను. నేను చేసిన వ్యాఖ్యల వల్ల చాలామంది నిరాశ చెంది ఉంటారు. రైతుల చట్టాలను ప్రతిపాదించినప్పుడు చాలామంది వీటికి మద్దతు తెలిపారు.

Also Read: ఆఫీస్‌ వర్క్‌ టార్చర్‌కు మరో యువతి బలి..? ఇంకెన్ని ఘోరాలు చూడాలో!

 కానీ ప్రధాని సానుభూతితో రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతం నేను యాక్టర్‌ని మాత్రమే కాదు.. బీజేపీ సభ్యురాలిని. రైతు చట్టాలపై నేను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా నిరాశకు గురైతే.. వారికి నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను. నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని'' కంగనా రనౌత్‌ చెప్పారు. మరోవైపు బుధవారం ఉదయం కంగనా ఎక్స్‌ వేదికగా ఓ ట్వీట్‌ కూడా చేశారు. రైతు చట్టాలపై నా అభిప్రాయం వ్యక్తిగతం మాత్రమేనని.. పార్టీ వైఖరికి సంబంధం లేదని రాసుకొచ్చారు. 

ఇదిలాఉండగా.. రైతు చట్టాలకు సంబంధించి కంగనా రనౌత్‌ ఈ వ్యాఖ్యలు చేయడం మొదటిసారి కాదు. గతంలో కూడా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. భారత్‌లో బంగ్లాదేశ్‌ లాంటి పరిస్థితులు తెచ్చేందుకే రైతు చట్టాలపై నిరసనలు జరిగాయని ఆరోపించారు. నిరసన జరిగిన ప్రాంతాల్లో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని.. పలువురిపై అత్యాచారాలు జరిగాయంటూ పేర్కొంది. ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్రంగా వివాదాస్పదమయ్యాయి. విపక్ష పార్టీలతో పాటు నెటిజన్ల నుంచి కంగనాపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అయితే  తాజాగా కంగనా రనౌత్‌ రైతు చట్టాలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గడం, క్షమపణలు చెప్పడం చర్చనీయాంశమవుతోంది. 

Also Read:  ప్రతీకార రాజకీయాలకు భయపడేది లేదు– కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

Advertisment
Advertisment
తాజా కథనాలు