/rtv/media/media_files/2025/02/13/bVhLif4b1fYTs9fM9TkY.jpg)
Kangana Ranaut
Kangana Ranaut: బాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు కాంగ్రెస్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపింది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజెన్లు కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల కంగనా రనౌత్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ''ది మౌంటైన్ స్టోరీ''(The Mountain Story) అనే పేరుతో హిమాచల్‌ప్రదేశ్(Himachal Pradesh)లోని మనాలి(Manali)లో ఓ కేఫ్‌ను ఏర్పాటు చేశారు.
Also Read: అమెరికాలో కోడిగుడ్ల కొరత..డజను గుడ్ల ధర ఎంతంటే?
కాంగ్రెస్ అభినందనలు..
ఫిబ్రవరి 14న ఈ కేఫ్‌ను ప్రారంభించనున్నారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ ఆమెకు అభినందనలు తెలిపింది. '' మీ కొత్త శాఖాహార రెస్టారెంట్ గురించి తెలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నాం. టూరిస్టుందరికీ మీరు హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రత్యేకమైన వెజ్ వంటకాలు అందిస్తారని ఆశిస్తున్నాం. ఈ వ్యాపారం విజయవంతం కావాలని కోరుకుంటున్నామని'' కాంగ్రెస్‌లో ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్టు వైరలవ్వడంతో నెటిజెన్లు స్పందిస్తు్న్నారు. బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ అభినందనలు చెప్పడం ఏంటని విమర్శిస్తున్నారు.
Also Read : ముందుకూ, వెనక్కూ ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు
Dear @KanganaTeam,
— Congress Kerala (@INCKerala) February 12, 2025
We are happy to learn about your new 'pure vegetarian' restaurant. Hope you'll serve some amazing Himachali vegetarian dishes for all tourists. Wishing all success for this venture! pic.twitter.com/00z8I0w9UB
ఓ యూజర్ ఈ ఖాతా హ్యాక్ అయ్యిందా అని పోస్టు చేశాడు. మరో యూజర్ బహుశా ఈ అకౌంట్‌ను స్కూల్ స్టూడెంట్స్ నడుపుతున్నారు అనుకుంటా అని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ మద్దతుదారుల నుంచి కూడా దీనిపై వ్యతిరేకత వస్తోంది. మరోవైపు తన చిన్ననాటి కల ఇప్పుడు నెరవేరిందని .. హిమాలయాల ఒడిలో చిన్న కేఫ్ ఏర్పాటు చేశామని కంగనా రనౌత్ ఇటీవలే సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. సంప్రదాయ హిమాచల్ ఫుడ్‌ను ఆధునిక అభిరుచులకు తగ్గట్టు అందించడమే దీని లక్ష్యమని వెల్లడించారు.
Also Read: ఢిల్లీ సీఎం ఎంపిక అప్పుడే.. ఇద్దరికి డిప్యూటీ సీఎంలుగా ఛాన్స్..!
Also Read: REVANTH BHIMALA: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేం బుల్లి రాజు తండ్రి పోలీస్ కంప్లైంట్.. సంచలన పోస్ట్!