Jagga Reddy: ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి కొనసాగుతారని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ ను సీఎం పదవిలో నుంచి దించేందుకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదన్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పారు. తమ గుర్తింపు కోసం బీఆర్ఎస్ ఓ వైపు బీజేపీ మరోవైపు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
jagga reddy
Telangana: కవితకు నోటీసులు అందుకే పంపారు: జగ్గారెడ్డి
ఈనెల 26న విచారణకు హాజరుకావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవితకు సీబీఐ నోటీసులు పంపగా.. ఈ విచారణకు హాజరుకాలేనని కవిత లేఖ పంపడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ అంశంపై స్పందించారు. బీఆర్ఎస్, బీజేపీలు సిద్దాంతాలు లేను పార్టీలంటూ విమర్శించారు. ఆ రెండు పార్టీలు కూడా అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యులర్ అనే మాటకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు.
Also read: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ ఎవరంటే..
ఓట్లు చీల్చడం కోసమే
కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాటలకు బీజీపీలో విలువ లేదంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చి.. కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. కవితను అరెస్టు చేస్తే సానుభూతి వచ్చి.. ఓట్లు డైవర్ట్ అవుతాయని వాళ్ల లెక్క అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఓట్లు చీల్చాలనేదే వాళ్ల ఆలోచన అంటూ మండిపడ్డారు. ఇదిలాఉండగా.. ఈ నెల 26న విచారణకు హాజరుకావాలంటూ ఆమెకు సీబీఐ నోటీసులు జారీ చేయగా.. ముందే నిర్ణయించిన షెడ్యూల్ ఉండటంతో రేపటి విచారణకు రాలేనని కవిత తేల్చి చెప్పారు. ఈ మేరకు సీబీఐకి లేఖ రాశారు.
తనకు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని కోరారు. ఏదైన సమాచారం కావాలంటే వర్చువల్ విధానంలో హాజరవుతానని స్పష్టం చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సరికాదంటూ పేర్కొన్నారు. సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో నా పాత్ర లేదని.. ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. ఈడీ నోటీసులు జారీ చేయగా తాను సుప్రీం కోర్టుకు వెళ్లానని.. కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉండటం వల్ల.. తనను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీ సీబీఐకి కూడా కూడా వర్తిస్తుందని.. గతంలో కూడా సీబీఐ హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించినట్లు చెప్పారు. కానీ.. 15 నెలల విరామం తర్వాత విచారణకు పిలవడం, సెక్షన్ల మార్పు వంటివి అనేక అనుమానాలకు తావునిస్తోందని ఆరోపిస్తున్నారు.
Also Read: మీకు బైక్ ఉందా? అయితే ఆ స్కీం కట్..మీరు ఆ లిస్టులో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి.!
Jagga Reddy: కవితకు సీబీఐ నోటీసులు… జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
Jagga Reddy: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితను అరెస్ట్ చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ రోడ్డెక్కుతుందని అన్నారు. సింపతితో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ఆరోపించారు. అన్నమాట నిజం చేసినట్లు బీజేపీ ప్రచారం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే 14 సీట్లు గండికొట్టేలా బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఆ రెండు పార్టీల తీరును గమనించాలని కోరారు. ఎన్నికల ముందు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆడుతున్న నాటకం ఇదాని అన్నారు.
ALSO READ: త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ, 6 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీఎం రేవంత్
చీకటి ఒప్పందాలు..
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నడుమ చీకటి ఒప్పందాలు ఉన్నాయని అన్నారు జగ్గారెడ్డి. కవిత లిక్కర్ కేసు సురభి నాటకంలా మారిందని ఎద్దెవ చేశారు. మరికొన్ని నెలల్లో జరగబోయే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ నడుమ ఒప్పందం కుదిరినట్లు ఉందని.. అందుకే తెర మీదికి కవిత లిక్కర్ స్కాం కేసు వచ్చిందని అన్నారు. ఎన్నికలు రాగానే ఇలాంటి డ్రామాలు మొదలు పెట్టి లబ్ది చేకూర్చుకునేలా ఆ రెండు పార్టీలు పనిచేస్తాయని పేర్కొన్నారు.
ఇగ కవిత అరెస్ట్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాకా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తారని ఆనాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పదే పదే చెప్పుకుంటూ తిరిగారని జగ్గారెడ్డి అన్నారు. బండి సంజయ్ ఏది చెప్తుంటే అదే జరుగుతుందని పేర్కొన్నారు. బీజేపీ నేతలు ఈడీ కి విలువ లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. కేసీఆర్, మోడీ లవర్స్ అని అన్నారు జగ్గారెడ్డి. లవర్స్ మధ్య ఏం జరుగుతుందో తమకు ఎలా తెలుసు అంటూ సెటైర్లు వేశారు. లోక్ సభ ఎన్నికల్లో పొత్తులపై చర్చించేందుకే కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారని ఆరోపణలు చేశారు.
Jagga Reddy: సీఎం అయ్యేందుకు హరీష్ 5వేల కోట్ల స్కాం.. జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు
Jagga Reddy: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుపై (Harish Rao) కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి అధికారంలో ఉన్న ఆనాటి టీఆర్ఎస్ (TRS) ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS) హయాంలో మంత్రిగా ఉన్న హరీష్ రావు భారీగా డబ్బు సంపాదించుకున్నాడని జగ్గారెడ్డి ఆరోపణలు చేశారు.
హరీష్ రావుకు నిద్ర పట్టడం లేదు…
ఇవాళ ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎతులు, అపొజిషన్లో ఉన్నప్పుడు నీతులు చెబుతున్నారని చురకలు అంటించారు. హరీష్ రావు నిజంగా పాపాల భైరవుడే అని పేర్కొన్నారు. హరీష్ రావు పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అని వ్యాఖ్యానించారు. రేవంత్, ఉత్తమ్ రివ్యూలు చేస్తుంటే హరీష్ రావుకు నిద్ర పట్టడం లేదని అన్నారు.
ALSO READ: ఇప్పుడున్న సీఎం దొంగ.. రేవంత్ పై కేటీఆర్ ఫైర్
సీఎం అయేందుకు 5000 కోట్లు…
2018 ఎన్నికల ముందు హరీష్ రావు రూ.5000 కోట్ల రూపాయలు దాచి పెట్టినట్టు సమాచారం ఉందని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి కావడానికి హరీష్ రావు రూ.5000 కోట్ల లిక్విడ్ క్యాష్ రెడీ చేసి పెట్టాడని అన్నారు. రూ.5000 కోట్లు హరీష్ రావు ఎక్కడ దాచిపెట్టాడో బయటపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి లేఖ రాస్తానని అన్నారు.
అతని దగ్గరే డబ్బులు…
ENC హరిరామ్ దగ్గర హరీష్ రావు డబ్బులు ఉన్నాయని అన్నారు. రెండవసారి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక హరీష్ రావుకు సంవత్సరం దాకా మంత్రి పదవి కేసీఆర్ ఇవ్వలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ తప్పులన్నీ బయట పెడతాం.. ఇది ఆరంభం మాత్రమే అని వార్నింగ్ ఇచ్చారు. హరీష్ రావు 5వేల కోట్లు, కవిత, సంతోష్ కొన్ని వేల కోట్లు బ్లాక్ చేశారని ఆరోపించారు.
కేసీఆర్ వల్లే డబ్బు కనిపించడం లేదు..
కేసీఆర్ (KCR) కుటుంబం డబ్బులు బ్లాక్ చేయడం వల్ల మార్కెట్లో డబ్బులు కనిపించడమే లేదని అన్నారు. కాంగ్రెస్ ఉచిత బస్సు పెట్టడంతో మేడారంలో భక్తుల సంఖ్య పెరిగిందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజల సొమ్ము కేసీఆర్ అనుభవించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల సొమ్ము ప్రజలే అనుభవిస్తున్నారని తెలిపారు.
కిషన్ రెడ్డికి పౌరుషం లేదు..
కేసీఆర్ కుటుంబంపై ఐటీ, ఈడీ దాడులు జరగవు.. కిషన్ రెడ్డిని రండ కేంద్రమంత్రి అంటే సైలెంట్ ఉన్నాడని అన్నారు. కిషన్ రెడ్డికి పౌరుషం లేదు.. సైలెంట్ ఉన్నాడని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి పౌరుషం ఉంది కాబట్టి పిసికేస్తుండు అని అన్నారు. సుమన్ లాంటివాళ్ళు ఇంకోసారి ఇలా చేస్తే మేం డైరెక్ట్ వెళ్లి కొడతాం అని స్పష్టం చేశారు. తిట్ల పురాణానికి కేసీఆర్ గురువు అని… కానీ కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ కే గురువులు అని పేర్కొన్నారు.
ALSO READ: కేసీఆరే టార్గెట్.. సీఎం రేవంత్ వ్యూహాలు.. కేసీఆర్‌కు షాక్ తప్పదా?
DO WATCH:
Jagga Reddy: కాంగ్రెస్ కూలిపోతోందని ఇందుకే అంటున్నారు.. విజయసాయి రెడ్డి బ్రోకర్ దుకాణం పెట్టుకున్నవా?: జగ్గారెడ్డి
Jagga Reddy Fired on KTR and Harish Rao: బీఆర్ఎస్ కు వారి ఎమ్మెల్యేలు చేజారిపోతారని భయం పట్టుకుందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. త్వరలోనే 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రేస్ లో చేరతారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ కూలిపోతోంది అని కేటీఆర్ (KTR)..హరీష్ రావు (Harish Rao) అంటున్నారన్నారు. పార్టీని కాపాడుకోవాలనే అలా కామెంట్స్ చేస్తున్నారని వివరించారు. కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయ సందిగ్ధంలో ఉందన్నారు జగ్గారెడ్డి.
Also Read: జనసేన నేత హత్యాయత్నం కేసులో ఊహించని ట్విస్ట్..!
ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డిపై (Vijayasai Reddy) నిప్పులు చెరిగారు. బ్రోకర్ దుకాణం ఏదైనా పెట్టుకున్నవా? విజయసాయి రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నికేమైనా విలువలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కాళ్ళును విజయసాయి రెడ్డి మొక్కాడని అన్నారు. కేసీఆర్ (KCR) ని అదరగొట్టిన వ్యక్తి వైఎస్ అని.. అలాంటి వైఎస్ కొడుకు ఆత్మ విజయసాయిరెడ్డి ..కేసీఆర్ కాళ్ళు మొక్కుడు ఏంటని తనకే సిగ్గగా అనిపించిందన్నారు. మోడీ డైరెక్షన్ లోనే..కేసీఆర్.. జగన్ పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
Also Read: మేకపాటికి చేదు అనుభవం.. రసభసగా గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం..!
ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు. 12 నుండి 14 ఎంపీ సీట్లు గెలవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. మీడియేటర్ విజయ సాయి రెడ్డి..కేటీఆర్..హరీష్ కుట్రలు తిప్పి కొడతామన్నారు. వీలైనంత త్వరలోనే 20 మంది ఎమ్మెల్యే లను కాంగ్రెస్ లోకి (Congress) తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆట మొదలైంది.. చూసుకోండి అంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారని గుర్తు చేశారు. ఆరోగ్య శ్రీ 15 లక్షలు పెంచారని..రూ. 500 కె సిలిండర్, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ త్వరలోనే ప్రారంభం కానుందన్నారు. సోనియాగాంధీ.. రాహుల్ గాంధీల నిర్ణయం మేరకు పథకాల అమలవుతున్నయన్నారు.
Jaggareddy: నేను రేవంత్‌కు భజన చేసే బ్యాచ్ కాదు.. జగ్గారెడ్డి హాట్ కామెంట్స్
EX MLA Jaggareddy: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) అభ్యర్థిగా బరిలోకి దిగిన జగ్గారెడ్డి.. తన ఓటమికి గల కారణాలను ఆర్టీవీతో (RTV Exclusive Interview) పంచుకున్నారు. తన తదుపరి కార్యాచరణపై వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి మంత్రి పదవి ఆశిస్తున్నారా? లేదా ఎంపీ టికెట్ ఆశిస్తున్నారా? అనే దానిపై ఆయన ఆర్టీవీకి క్లారిటీ ఇచ్చారు.
ALSO READ: గుడ్ న్యూస్.. రూ.29లకే కిలో బియ్యం.. కేంద్రం కీలక ప్రకటన
రెండు కారణాలు..
సంగారెడ్డిలో (Sangareddy) తన ఓటమికి రెండు కారణాలు అని అన్నారు జగ్గారెడ్డి. హరీష్ రావు (Harish Rao) పంచిన డబ్బు ఒక కారణం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజలకు అందుబాటులో ఉండననేది మరో ప్రచారం జరిగిందని అన్నారు. ఓడిపోయినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. జగ్గారెడ్డి ఫైటర్, తనకు మంత్రి కావాలని ఉండదు అని మంత్రి పదవిపై క్లారిటీ ఇచ్చారు.
20 మంది ఎమ్మెల్యేలను..
తాను సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) ఓ సలహా ఇచ్చానని.. బీఆర్ఎస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలని లేపాలని చెప్పినట్లు జగ్గారెడ్డి తెలిపారు. ఆ అవకాశం బీఆర్ఎస్ నేతలు తమకు ఇస్తున్నారని అన్నారు. 20 మందిని లాగేద్దామని రేవంత్‌కి చెప్పాను అని అన్నారు. తన ముందు హరీష్ పిల్లోడు అని పేర్కొన్నారు. దమ్ముంటే హరీష్ తన ముందుకు రావాలని సవాల్ విసిరారు.
పోలీసులు బీఆర్ఎస్కు పనిచేశారు..
మొన్న ఎన్నికల్లో సంగారెడ్డిలో పోలీసులు బీఆర్ఎస్కు అనుకూలంగా ప్రవర్తించారని ఆరోపించారు జగ్గారెడ్డి. జగ్గారెడ్డి ఒక్కసారి అనుకుంటే అందర్నీ అడ్డుకునే వాడే అని అన్నారు. బీఆర్ఎస్ వాళ్లు పంచే డబ్బులు ని అడ్డుకోవద్దని ప్రజలు కోరుకున్నారని పేర్కొన్నారు. లేదంటే SP, CI, SI లను గల్లా పట్టికొట్టేవాడినాని అన్నారు.
మెదక్ ఎంపీగా..
మెదక్ ఎంపీ సీటును తనకు ఇవ్వాలని.. రేవంత్ రెడ్డికి మెదక్ నుంచి పోటీ చేస్తా అని చెప్పినట్లు తెలిపారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్‌ను అడ్డుకునే దమ్మున్న నాయకుడిని తానే అని అన్నారు. రేవంత్ నేను ఇంకా చాలామంది తెలంగాణ పీసీసీ చీఫ్ కోసం పోటీ పడ్డాం అది అంతవరకే అని.. రేవంత్ రెడ్డి ఇంట్లో నేను రేవంత్ ని కలిసింది దానికి కారణాలు చాలా ఉన్నాయి కొన్ని మీడియా ముందు చెప్పలేను అని అన్నారు.
రేవంత్ ను పొగిడే బ్యాచ్ నేను కాదు..
రేవంత్ ను పొగిడే బ్యాచ్ నేను కాదు ..జగ్గారెడ్డి అంటే డిఫరెంట్ అని అన్నారు. తన కూతురు పోటీకి దూరం అని క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే తన కూతురు పెళ్లి చేయబోతున్నట్లు తెలిపారు. పది సంవత్సరాల తర్వాత తన కూతురు రాజకీయాల్లోకి వస్తుందని పేర్కొన్నారు. దేవుడితో రాజకీయం చేసే పార్టీ కాంగ్రెస్ కాదు అని అన్నారు. రాహుల్ గాంధీ పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో పుట్టాడని వ్యాఖ్యానించారు. బీజేపీ దేవుడి పేరుతో రాజకీయం చేయాలనుకుంటుందని ఆరోపించారు.