Jagga Reddy Teaser Launch : “నా జీవితంలో జరిగిన విషయాలనే నేను రాసుకొని ఇప్పుడు మూవీలో చూపించబోతున్నాను. రాజకీయంలో నేను పోషించిన పాత్ర, సక్సెస్ ఫుల్ ప్రయాణం, సినిమాలో కూడా అదే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే , డైరెక్టర్ అన్నీ నేనే” అంటూ జగ్గారెడ్డి తెలిపారు.ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ విడుదల కాగా.. దీనికి భారీ స్పందన వచ్చింది. ‘జగ్గారెడ్డి-ఏ వార్ ఆఫ్ లవ్’ సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఉగాది పండుగ సందర్భంగా సినిమా ఆఫీస్‌ను జగ్గారెడ్డి నంది నగర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మూవీ టీజర్ కూడా రిలీజ్ చేశారు.
Also Read: ఫ్రీ కాంప్లిమెంటరీ పాస్‌ల వివాదం.. అంత ఉత్తదే అంటోన్న హెచ్ సీ ఏ
ఇక సినిమా నుండి విడుదల చేసిన టీజర్ పోస్టర్ అలాగే వీడియో గురించి స్పందిస్తూ.. “ఇది నా ఒరిజినల్ క్యారెక్టర్. పోలీసులను కొట్టినట్లు హీరోలు నటిస్తారు కదా.. కానీ అవన్నీ నేను ఒరిజినల్ గా చేశాను. ముఖ్యంగా విద్యార్థి నేతగా, కౌన్సిలర్ గా, మున్సిపల్ చైర్మన్గా నా బాధ్యతలు చేపడుతూనే.. ఆ సమయంలో నేను ఎదుర్కొన్న కష్టాలు, బాధలు అన్నీ కూడా చూపించనున్నాను. నా రాజకీయ జీవిత కథను ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాను” అంటూ జగ్గారెడ్డి తెలిపారు. మొత్తానికైతే జగ్గారెడ్డి టైటిల్తో జగ్గారెడ్డి తన సినిమాను తానే రాసుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Also Read: కుక్కలను తప్పించుకోబోయి బావిలో.. 3 రోజులు అక్కడే! తర్వాత ఏం జరిగిందంటే...
కాగా ఈ టీజర్ 50 సెకంన్ల పాటు ఉంది. ఈ టీజర్‌లో పవర్‌ఫుల్ డైలాగ్ ఒకటి ఎంతగానో ఆకర్షిస్తోంది. ‘‘దెబ్బలు పడే కొద్ది శిల్పంలా మారడానికి రాయి కాదు.. తగిలే ప్రతి దెబ్బని ఆయుధంగా మార్చుకునే జగ్గారెడ్డి.. సంగారెడ్డి జగ్గారెడ్డి.. అంటూ టీజర్‌లో డైలాగ్ వినిపిస్తుంది. దీనిపై టీజర్ అదిరిపోయిందని.. జగ్గరెడ్డి డైలాగ్ ఇంకా అదిరిందంటూ.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు నిర్మాత జయలక్ష్మీ రెడ్డి కాగా.. రైటర్, డైరెక్టర్‌గా రామానుజం పని చేస్తున్నారు. జగ్గారెడ్డి జీవితంలోని పలు అంశాలను కథగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: పుతిన్‌ను హత్య చేసేందుకు ప్లాన్.. కారులో బాంబు పేలుడు
నా నిజ జీవితం పాత్రలో నేను నటిస్తున్నాను.. మిగతా విషయాలు త్వరలో ప్రకటిస్తామన్నారు. చిత్ర నిర్మాత , జగ్గారెడ్డి కూతురు జయలక్ష్మి రెడ్డి మాట్లాడుతూ.. నాన్న తన జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్ కి వచ్చారు.. ఆయన జీవితం ఒక ఇన్స్పిరేషన్ అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే జగ్గారెడ్డి టైటిల్తో జగ్గారెడ్డి తన సినిమాను తానే రాసుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఎలాంటి విజయం అందుకుంటారో చూడాలి.
Also Read: చైనాలో భూ ప్రకంపనలు.. ఆస్పత్రిలో చిన్నారులను కాపాడిన సిబ్బంది, వీడియో వైరల్
Jagga Reddy Teaser Launch : నా రాజకీయ జీవిత కథను నేనే రాసుకున్నాను. టీజర్ లాంఛ్ లో జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు.!
నా జీవితంలో జరిగిన విషయాలనే నేను రాసుకొని ఇప్పుడు మూవీలో చూపించబోతున్నాను. రాజకీయంలో నేను పోషించిన పాత్ర, సక్సెస్ ఫుల్ ప్రయాణం, సినిమాలో కూడా అదే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే , డైరెక్టర్ అన్నీ నేనే” అంటూ జగ్గారెడ్డి తెలిపారు.
jaggareddy-cinema