CM Kejriwal: లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ తన శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగాయని.. అందుకోసం తనకు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అందించాలని.. అలాగే ప్రతి రోజు 15 నిమిషాల పాటు వీడియో కాల్ ద్వారా డాక్టర్ తో సంప్రదించేందుకు అనుమతి ఇవ్వాలని.. లేదంటే తన ఆరోగ్యానికి చాలా ప్రమాదం సంభవించవచ్చని.. వెంటనే తన విజ్ఞప్తులను విని.. తగిన అనుమతులు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు.. ఈ నెల 22న తీర్పును వెలువరించనుంది.
Delhi’s Rouse Avenue Court reserved the order on a plea moved by Delhi CM Arvind Kejriwal seeking direction to Jail Authorities to administer insulin and allow him to consult through video conferencing daily for 15 minutes with respect to his acute diabetes and fluctuating blood… https://t.co/bE7lh2uVXH
— ANI (@ANI) April 19, 2024
ALSO READ: మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు హైకోర్టు షాక్
కేజ్రీవాల్ పై ఈడీ సంచలన ఆరోపణలు..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు చేసింది ఈడీ. కేజ్రీవాల్ అనారోగ్యానికి సంబంధించి పలు విషయాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవల ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు షుగర్ లెవల్స్ పడిపోగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక్కడివరకూ బాగానే ఉన్నా.. కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ అప్ అండ్ డౌన్ కావాడానికి బలమైన కారణాలున్నాయని ఈడీ తెలిపింది.
మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారు..
ఈ మేరకు కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ పడిపోతుండటంతో తన రెగ్యులర్ డాక్టర్ను సంప్రదించేందుకు వారానికి 3సార్లు వీడియో కాన్ఫరెన్స్ అనుమతి కావాలని కోరుతూ కేజ్రీవాల్ ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేశారు. అయితే దీనిపై స్పందించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ .. కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారని చెప్పింది. అంతేకాదు చక్కెరతో కూడిన టీ తాగుతున్నారని గురువారం ఢిల్లీ న్యాయస్థానికి వివరించింది. ఉద్దేశ్యపూర్వకంగానే స్వీట్స్ తిని షుగర్ లెవల్స్ పెంచుకుంటున్నారని, షుగర్ లెవెల్స్ పెరిగితే వైద్యపరమైన కారణాలతో బెయిల్ పొందాలనుకుంన్నారని స్పష్టం చేసింది.
ఇవన్నీ ఆరోపణలు మాత్రమే..
ఇక ఈడీ వ్యాఖ్యలను ఆప్ నెతలు ఖండించారు. ఇవన్నీ ఆరోపణలు మాత్రమే అని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వివేక్ జైన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజంగానే కేజ్రీవాల్ ఆరోగ్యం దెబ్బతిన్నట్లు ఆయన కోర్టులో వివరించారు. ఇక మార్చి 21న కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయగా.. మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ సిటీ కోర్టు స్పెషల్ జడ్జి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.