ఈడీకి సుప్రీం కోర్టు చురకలు.. ‘హద్దులు దాటుతోంది’

ED తన అన్నీ హద్దులను మీరుతుందని సుప్రీంకోర్టు ఆగ్రహంచింది. తమిళనాడులో మద్యం అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని టాస్మాక్‌ ఆఫీస్, అధికారుల ఇళ్లపై తనిఖీలు చేపట్టింది. సోదాలు ఆపాలని తమిళనాడు సర్కార్‌ సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీంతో కోర్టు ఈడీకి చురకలు వేసింది.

New Update
ED with SC

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ తన లిమిట్స్ దాటుతోందని వ్యాఖ్యానించింది. సమాఖ్య పాలన భావనను ఈడీ ఉల్లంఘిస్తోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. టాస్మాక్‌‌పై జరుగుతున్న మనీలాండరింగ్‌ దర్యాప్తును వెంటనే నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మద్యం రిటైలర్‌ టాస్మాక్‌లో రూ.1000 కోట్ల అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాస్మాక్‌పై ఈడీ అధికారులు ఇటీవల సోదాలు జరిపారు. ఆ సంస్థ ప్రధాన కార్యాలయం, టాస్మాక్‌ అధికారుల ఇళ్లల్లో ఈ ఏడాది మార్చి, మే నెలల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్లు తనిఖీలు చేపట్టారు. దీంతో ఈ సోదాలపై తమిళనాడు సర్కార్‌ హైకోర్టుకు వెళ్లింది.

Also read; Anasuya: అనసూయ ఇంట మరో శుభకార్యం.. కొడుకు 'ఉపనయనం' వేడుక ( వీడియో వైరల్)

ఈడీ చర్యలను మద్రాస్ హైకోర్టు సమర్ధించింది. విచారణ పేరిట టస్మాక్‌ అధికారులను ఈడీ వేధిస్తోందంటూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈడీ దర్యాప్తుకు అనుమతించింది. దీంతో స్టాలిన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈడీ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఈడీ అన్ని హద్దులూ మీరుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. టాస్మాక్‌‌పై జరుగుతున్న మనీలాండరింగ్‌ దర్యాప్తును వెంటనే ఆపేయాలని ఆదేశించింది. 

Also read: Operation Sindoor: నా నరాల్లో రక్తం కాదు సిందూరం మరుగుతోంది.. ప్రధాని మోదీ ఎమోషనల్

(supreme court india | supreme court news | ed | enforcement-directorate | TASMAC | dmk | tamilanadu | latest-telugu-news)

Advertisment
తాజా కథనాలు