Noida Rocket : ఈడీ సంచలనం...భారీ వ్యభిచార రాకెట్‌ గుట్టు రట్టు...కోట్లల్లో దందా..

నోయిడాలో భారీ వ్యభిచార రాకెట్‌ గుట్టు రట్టయ్యింది. ఈ రాకెట్‌ గుట్టును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ‌(ED) రట్టు చేసింది. గత ఐదేళ్లుగా భార్యభర్తలు ఇద్దరూ ఈ దందా నడుపుతున్నట్టు గుర్తించారు. ఈ ముఠాకు అంతర్జాతీయంగా సంబంధాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. 

New Update
 prostitution racket

prostitution racket

 Noida Rocket : నోయిడాలో భారీ వ్యభిచార రాకెట్‌ గుట్టు రట్టయ్యింది. ఈ రాకెట్‌ గుట్టును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ‌(ED) రట్టు చేసింది. గత ఐదేళ్లుగా భార్యభర్తలు ఇద్దరూ ఈ దందా నడుపుతున్నట్టు గుర్తించారు. ఈ వ్యభిచార రాకెట్‌ నడుపుతున్న ముఠాకు అంతర్జాతీయంగా సంబంధాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. నోయిడాలోని ఓ ఇంటిపై దాడిచేసి రూ.15.66 కోట్ల అక్రమ విదేశీ నిధుల్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: కుక్కలను తప్పించుకోబోయి బావిలో.. 3 రోజులు అక్కడే! తర్వాత ఏం జరిగిందంటే...

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడాలో ఉజ్వర్ కిషోర్, అతడి భార్య నీలు శ్రీవాస్తవ గత ఐదేళ్లుగా వ్యభిచార రాకెట్‌ దందా నడుపుతున్నారు. ఫారెన్ ఫండ్స్ తో లక్షల్లో జీతాలు ఇస్తూ.. సంపాదన ఎరగా వేస్తూ పోర్న్ రాకెట్ నడుపుతున్న దంపతులను పట్టుకున్నారు ఈడీ అధికారులు.  సైప్రస్‌ దేశానికి చెందిన టెక్నియస్ లిమిటెడ్ అనే సంస్థతో ఈ జంటకు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సంస్థ ఎక్స్ హామ్‌స్టర్, స్ట్రిప్‌చాట్ వంటి అడల్ట్ ఎంటర్ టైన్ మెంట్ వెబ్‌సైట్‌లను నిర్వహిస్తోంది.

Also Read: పుతిన్‌ను హత్య చేసేందుకు ప్లాన్.. కారులో బాంబు పేలుడు
 
ఈ జంట  'echato dot com' పేరుతో ఒక పేజీని సృష్టించి, ఆకర్షణీయమైన జీతాలు ఇస్తామని ప్రకటనలు ఇచ్చారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతానికి చెందిన చాలా మంది మహిళలు ఈ ప్రకటనల ద్వారా ఆకర్షితులయ్యారు. ఆడిషన్ల సమయంలోనే పోర్న్ చిత్రాల్లో నటించాలని చెప్పి.. నెలకు రూ. 1 నుండి రూ.2 లక్షల వరకు సంపాదన ఉంటుందని ఆశ చూపుతారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి మోడళ్లను నియమించుకుంటుంది ఈ జంట. ఈడీ దాడుల్లో ఈ ఫ్లాట్‌లో ఒక ప్రొఫెషనల్ వెబ్‌క్యామ్ స్టూడియోను కనుగొన్నారు. ఇది ఓన్లీఫ్యాన్స్ వంటి అడల్ట్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను ప్రసారం చేయడానికి ఉపయోగపడుతుంది.  దాడి సమయంలో ముగ్గురు మహిళలు ఆన్‌లైన్‌లో కనెక్ట్ అయి పనిచేస్తూ కనిపించారు. ఈడీ వారి నుంచి స్టేట్ మెంట్ తీసుకుంది. ఈ దందా నుంచి వీళ్లు సంపాదించిన ఆదాయంలో 75 శాతం ఉంచుకుని 25 శాతం మాత్రమే మోడల్స్‌కు ఇస్తూ గుట్టు చప్పుడు కాకుండా దందా నడుపుతున్నారు. 

ప్రారంభంలో కస్టమర్స్ నుంచి క్రిప్టోకరెన్సీ ద్వారా చెల్లింపులు స్వీకరించేవారు. ఆ తర్వాత విదేశీ కరెన్సీని తీసుకునేవారు.  టెక్నియస్ లిమిటెడ్ ద్వారా నెదర్లాండ్స్‌లోని ఒక బ్యాంక్ ఖాతాలో రూ. 7 కోట్లు బదిలీ చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ నిధులను అంతర్జాతీయ డెబిట్ కార్డులను ఉపయోగించి భారతదేశంలో నగదు రూపంలో విత్‌డ్రా చేశారు. ఈ రాకెట్ ద్వారా వేలాది మంది మహిళలను నియమించి ఉండవచ్చని దర్యాప్తు సంస్థ తెలిపింది. పూర్తి విషయాలు దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని ఈడీ అధికారులు తెలిపారు. వినియోగదారులు చేసే చెల్లింపుల ఆధారంగా మోడల్స్ టాస్క్‌లను చేసేవారు. హాఫ్-ఫేస్ షోలు, ఫుల్-ఫేస్ షోలు, వివిధ కేటగిరీలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలను ఉపయోగించడానికి వినియోగదారులు టోకెన్‌లను కొనాల్సి ఉంటుంది. కేటగిరీని బట్టి ఛార్జీలు మారుతుంటాయి.  ఈ రాకెట్‌లో వేలాది మంది మహిళలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

Also Read: చైనాలో భూ ప్రకంపనలు.. ఆస్పత్రిలో చిన్నారులను కాపాడిన సిబ్బంది, వీడియో వైరల్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు