/rtv/media/media_files/2025/07/13/changur-baba-illegal-religious-conversions-2025-07-13-15-20-12.jpg)
Changur Baba's illegal religious conversions..
Changur Baba : దేశంలో మత మార్పిడిల కేసు సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా చంగూర్ బాబా చేపట్టిన మతమార్పిడిల కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో రోజు రోజుకు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జమాలుద్దీన్, అలియాస్ చంగూర్ బాబా, అలియాస్ పీర్ బాబా, అలియాస్ హజీ జమాలుద్దీన్ ఈ కేసులో కీలక నిందితుడిగా తేలింది. బలరాంపూర్ జిల్లా ఉత్రౌలా ప్రాంతానికి చెందిన జమాలుద్దీన్‌తో పాటు అతని సహచరురాలు నీతూ రోహ్రా (అలియాస్ నస్రీన్)ను జులై 5న ఉత్తరప్రదేశ్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ లక్నోలోని వికాస్ నగర్‌లోని స్టార్ రూమ్స్ హోటల్‌లో అరెస్టు చేసింది.
కాగా విదేశాల నుంచి పెద్దఎత్తున డబ్బులు కూడబెట్టి చంగూర్ బాబా దేశంలో మతమార్పిడిలకు పాల్పడుతున్నాడని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. చంగూర్ బాబా గతంలో ఒక సైకిల్ తొక్కుకుంటూ తిరుగుతూ ఉంగరాలు, తాయిత్తులు అమ్ముకునే వాడు. కానీ మతమార్పిడి అనంతరం అతను దాదాపు 100 కోట్ల వరకు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు.ఈ మేరకు అతనికి ఎక్కడ నుంచి నిధులు వస్తు్న్నాయనే విషయాన్ని గుర్తించే పనిలో పడింది. అతనికి మొత్తం 30 బ్యాంకుల్లో ఖాతాలున్నట్లె ఈడీ గుర్తించగా, వాటితో పాటు మరో 18 ఖాతాలు కూడా ఉన్నట్లు తేలింది. వీటిల్లో దాదాపు ఇప్పటివరకు రూ.68 కోట్ల మేరకు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ ఖాతాలకు గత మూడునెలల్లోనే విదేశాల నుంచి రూ.7 కోట్లు బదిలీ అయినట్లు తేలింది. చంగూర్ బాబాకు విదేశాల నుంచి వచ్చిన ఫండింగ్‌తో అక్రమ మతమార్పిడి నెట్‌వర్క్ నడిపినట్లు రుజువైంది. అతడికి భారత్, నేపాల్‌లో 100 వరకు ఖాతాలున్నట్లు భావిస్తున్నారు. గత మూడేళ్లలో అతడికి రూ.500 కోట్ల విదేశీ నిధులు అందగా.. వాటాల్లో రూ.300 కోట్లు అక్రమ మార్గాల్లోనే వచ్చినట్లు చెబుతున్నారు. అతడికి ముఖ్యంగా పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే, యూఏఈ నుంచి నిధులు వచ్చినట్లు అనుమానిస్తున్నారు.
ఈ గ్యాంగ్ డబ్బు, ఉద్యోగాలు, చికిత్సల ఆశ చూపి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, కార్మికులు, హిందూ యువతులను ఇస్లాంలోకి మార్చేందుకు లవ్ జిహాద్‌లు, బెదిరింపులు వంటి పద్ధతులను ఉపయోగించింది. ఇందులో భాగంగా జాతి ఆధారంగా మతమార్పిడి రేట్లు నిర్ణయించినట్లు తెలిసింది. బ్రాహ్మణ, క్షత్రియ, సిఖ్ యువతులకు రూ. 15--16 లక్షలు, బీసీ యువతులకు రూ. 10--12 లక్షలు, ఇతరులకు రూ. 8--10 లక్షలు ఇచ్చినట్లు అధికారులు నిర్ధారించారు.
జలాలుద్దీన్ మతమార్పిడులు నిర్వహించే క్రమంలో కోడ్ భాషను వినియోగించేవాడని తేలింది. అతడి అతడి బృందం లక్ష్యంగా ఎంచుకొన్న మహిళలను ‘ప్రాజెక్ట్’ అని.. మతమార్పిడిని ‘మిట్టీ పలట్నా’ అని.. మానసికంగా సదరు మహిళను మభ్యపెట్టడాన్ని ‘కాజల్ కర్నా’ అని, జలాలుద్దీన్‌తో భేటీ ఏర్పాటు చేయడాన్ని ‘దీదార్’ అని వ్యవహరించేవాడని తేలింది.దీన్ని యూపీ ఏటీఎస్ ఛేదించింది.
చంగూర్ బాబాకు చెందిన బలరామ్‌పుర్‌లోని భారీ విల్లాను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. ఇందులో కొన్ని గదులను ఇప్పటికే కూలగొట్టారు. నిన్న ఏటీఎస్ బృందం చంగూర్‌బాబాను ఈ ఇంటికి తీసుకొచ్చి 40 నిమిషాలపాటు విచారించారు. కీలక పత్రాలు, ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ భవనం అతడి సన్నిహితురాలు నీతు అలియాస్ నస్రీన్ పేరిట ఉంది. ఈ భవనంలో దాదాపు 70 గదులు ఉన్నాయని అధికారులు చెప్పారు. వీటిల్లో 40 గదలను కూలగొట్టారు. దీనికి కమాండోలను రక్షణగా పెట్టింది. ఇక చంగూర్‌బాబా దాదాపు 15 ఏళ్లుగా మతమార్పిడి రాకెట్‌ను వివిధ రూపాల్లో నిర్వహిస్తున్నాడని యూపీ ఏడీజీ లా అండ్ ఆర్డర్ అమితాబ్ యష్ పేర్కొన్నారు.