Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ బహరాయిచ్ జిల్లా ప్రజలు తోడేళ్ల కారణంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తోడేళ్ల గుంపు దాడులతో పలువురు ప్రాణాలు కోల్పోగా బిక్కుబిక్కుమంటున్నారు. దీంతో ‘ఆపరేషన్ భేడియా’ పేరుతో ఫారెస్ట్ అధికారులు వాటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ పెద్దగా ఉపయోగం ఉండట్లేదు. ఈ క్రమంలోనే యోగీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తోడేళ్లు కంటపడితే కాల్చివేయాంటూ అధికారులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన సీఎం యోగి.. తోడేళ్లను పట్టుకోవడం కష్టంగా మారితే వాటిని కాల్చేయాలని సూచించారు. అయితే అది చివరి అవకాశంగా మాత్రమే పరిగణించాలని తెలిపారు.
cm yogi aditya nath
Uttar Pradesh : యోగిని బుల్డోజర్లతో కూల్చిన యూపీ ఓటర్లు.. దూసుకెళ్తున్న ఇండియా కూటమి!
Yogi : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లో బీజేపీ (BJP) కి భారీగా గండి పడింది. ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి (INDIA Alliance) దుమ్మురేపుతోంది. యూపీ తమదే అనే ధీమాలో ఉన్న బీజేపీకి ఎస్పీ ఊహించని షాక్ ఇచ్చింది. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ స్పష్టమైన మెజార్టీతో దూసుకెళ్తోంది. మొత్తం 80 స్థానాల్లో ఇండియా కూటమికి చెందిన అఖిలేష్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ 62 సీట్లలోనూ, కాంగ్రెస్ 17 సీట్లలోనూ పోటీ చేస్తున్నాయి. ప్రస్తుతానికి యూపీలో ఇండియా కూటమి 44 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా, ఎన్డీయే 35 స్థానాల్లో కొనసాగుతోంది.
అయితే 2019 ఎన్నికల్లో ఎన్డీయే ఏకంగా 62 స్థానాలు కైవసం చేసుకుంది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో (Elections) మాత్రం యూపీలో రెండు కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రధాని మోడీ (PM Modi) వారణాసి నుంచి ఆయన లోక్‌సభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్ (Congress) అభ్యర్థి అజయ్ రాయ్ .. ముందంజలో ఉన్నారు. 11480 ఓట్ల తేడాతో అజయ్ రాయ్ లీడింగ్‌లో ఉన్నారు. మోడీ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఎన్నికల సంఘం వెబ్సైట్ ప్రకారం ఆయనకు 5257 ఓట్లు పోలయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బుల్డోజర్లతో సంచలనం సృష్టించిన యోగిని ఇప్పడు ఒటర్లు అదే బుల్డోజర్లతో కూల్చేశారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి 290 స్థానాల్లో లీడింగ్‌లో ఉండగా.. ఇండియా కూటమి 212 స్థానాల్లో దూసుకెళ్తుంది.
Also Read : చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్
Most Popular: దేశంలో పాపులర్ సీఎం ఎవరో తెలుసా ?
దేశంలో అత్యంత ప్రజాధారణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితాను ఓ ఆంగ్ర పత్రిక విడుదల చేసింది. ఇందులో అత్యంత ప్రజాధారణ కలిగిన సీఎంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్(77) మొదటిస్థానంలో నిలిచారు. ఒడిషాను 20 ఏళ్లకు పైగా పాలిస్తున్న ఆయన 52.7 శాతం ప్రజాదరణతో ఫస్ట్ ర్యాంక్‌ను సాధించారు. 2000లో అధికారంలోకి వచ్చిన నవీన్ పట్నాయక్.. అప్పటినుంచి ముఖ్యమంత్రి పదవిలోనే కొనసాగుతున్నారు. ఇక అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాన పాత్ర పోషించిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో నిలిచారు.
Also Read: కోటాలో మరో విద్యార్థి అదృశ్యం.. వారంలో రెండో ఘటన
ఒక శాతం తేడాతో రెండో స్థానంలో యోగి
నవీన్ పట్నాయక్ 52.7 శాతంతో ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా.. 51.3 శాతంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాకు. 2017లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన యోగీ.. యూపీలో అత్యధిక కాలం కొనసాగుతున్న సీఎంగా రికార్డు సృష్టించారు. ఇక అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ 48.6 శాతంతో మూడో స్థానంలో నిలిచారు. ఆయన 2021లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ 42.6 శాతం ప్రజాదరణతో నాలుగో స్థానంలో నిలిచారు. 2021లో గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా ఆయన పదవిలోకి వచ్చారు. ఇక త్రిపుర సీఎం మాణిక్ సాహా 41.4 శాతంతో అయిదవ స్థానాన్ని దక్కించుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాణిక్ సాహా 2016లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరి.. 2022లో త్రిపురలో ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు.
Also Read: గర్భిణీపై గ్యాంగ్ రేప్.. ఆ తర్వాత కిరోసిన్ పోసి నిప్పంటించిన దుండగులు
Telangana Elections 2023: కేసీఆర్‌పై యోగీ ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..
మరికొన్ని రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. బీజేపీ అగ్రనేతలు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాగజ్‌నగర్‌లో నిర్వహించిన సభలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లీం రిజర్వేషన్లు తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ముస్లీం రిజర్వేషన్లు రద్దు కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. 2017 కంటే ముందు యూపీలో పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలుసునని.. డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చాక ఒక్కరోజు కూడా అల్లర్లు జరిగిన సందర్భాలు లేవని వ్యాఖ్యానించారు.
Also read: మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మహిళలకు గుడ్‌న్యూస్.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో ప్రస్తుతం రైతులు సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితులు నెలకొంటున్నాయని.. పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రధాని మోదీ 10 లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి.. 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని మిగతావి కూడా పూర్తి చేస్తారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రహస్య మిత్రులని.. వీళ్ల మధ్యలో ఎంఐఎం పార్టీ ఉందని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని పేర్కొన్నారు.
Also read: రైతులకు రూ.300కే యూరియా.. కామారెడ్డిలో మోదీ!
Telangana Elections 2023: శనివారం బీజేపీ అగ్రనేతల ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ ఇదే
తెలంగాణలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార, విపక్ష నేతలు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేతలు పలు ప్రాంతాల్లో
పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
షెడ్యూల్ వివరాలు
ప్రధాని మోదీ..
రేపు ప్రధాని మోదీ మధ్యాహ్నం 1.00PM కామారెడ్డికి చేరుకుంటారు. 3:00 PM గంటలకు మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్లలో జరిగే పబ్లిక్ మీటింగ్‌లలో పాల్గొంటారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా..
రేపు 11:30 కొల్లాపూర్, 1:00 గంటకు మునుగోడు, 2 గంటలకు పటాన్చేరు, 5 గంటలకు ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో జరిగే పబ్లిక్ మీటింగ్‌లలో పాల్గొంటారు
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా..
రేపు మధ్యాహ్నం 1.00 PM గంటకు హుజుర్నగర్ లో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. 3:30 PM గంటలకు సికింద్రాబాద్, 5:00 గంటలకు ముషీరాబాద్ నియోజక వర్గాల్లో రోడ్ షోలో పాల్గొంటారు.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్..
రేపు 11:00 AM గంటలకు సిరిపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగే పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:00 PM గంటకు వేములవాడ నియోజకవర్గంలో జరిగే పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు. 2:30 PM గంటలకు సనత్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో జరిగే కార్నర్ మీటింగ్, సాయంత్రం 4:00 PM గంటలకు గోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్ కార్నర్ మీటింగ్‌లలో పాల్గొంటారు.
Telangana Elections: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీజేపీ బిగ్ లీడర్స్.. అమిత్ షా, యోగీ ఆదిత్య నాథ్, స్మృతీ ఇరానీ షెడ్యూల్ ఇదే!
తెలంగాణపై (Telangana Elections) ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టానం.. ప్రచార పర్వంలోకి అగ్రనేతలను దించేందుకు ప్లాన్ చేస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah), యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్, స్మృతీ ఇరానీ, అమిత్ షా, హింత బిశ్వ శర్మ ప్రచారంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలలో మొదటి విడతగా వీరు రాష్ట్రానికి రానున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను బీజేపీ తాజాగా విడుదల చేసింది. 20వ తేదీన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తెలంగాణలో పర్యటించనున్నారు. 27న కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరో సారి రాష్ట్రానికి రానున్నారు. ఇంకా.. 28న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సైతం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 31న యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
ఇది కూడా చదవండి: Telangana Congress: నేటి నుంచి మూడురోజులు కాంగ్రెస్ బస్సు యాత్ర
ఇదిలా ఉంటే.. బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఈ రోజు లేదా రేపు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ఈ రోజు ఢిల్లీ వెళ్లి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం అనంతరం పార్టీ నుంచి రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఫస్ట్ లిస్ట్ లో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితర అగ్రనేతల పేర్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీలో ఇప్పటికే జనసేనతో బీజేపీకి పొత్తు ఉన్న నేపథ్యంలో తెలంగాణలోనూ వారు కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకటి లేదా రెండు రోజుల్లో వీరి పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం.