Kollywood Actor Chiyaan Vikram : కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఇటీవల ‘తంగలాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పా.రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఆగస్టు 15 న రిలీజైన ఈ సినిమాలో విక్రమ్ మరోసారి తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాడు.
విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 6 న ఈ మూవీని హిందీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ బాలీవుడ్లో వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న విక్రమ్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Also Read : ‘గేమ్ ఛేంజర్’ వాయిదాపై దిల్ రాజు క్లారిటీ.!
“#Prabhas is one of the Biggest Superstars in India” ..We can’t talk of him as a Telugu Actor anymore! 🥵❤️🔥💥 — Vikram pic.twitter.com/1QdgzsjmWa
— . (@charanvicky_) August 27, 2024
ఇంటర్వ్యూలో యాంకర్ తెలుగు హీరో ప్రభాస్ అని సంబోధించగా.. ప్రభాస్ ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఆయనను ఇప్పుడు కేవలం తెలుగు హీరో మాత్రమే అనడం సరికాదు అంటూ విక్రమ్ చెప్పుకోచ్చారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డార్లింగ్ ఫ్యాన్స్ ఈ వీడియోను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు.