/rtv/media/media_files/2024/10/21/otI3Y6VEjkxhstYCYOnb.jpg)
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ నటించిన 'తంగలాన్' మూవీ ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పీరియాడికల్ యాక్షన్ కథాంశంతో రూపొందింది. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సినిమాలో విక్రమ్ నటన, ఆయన కనిపించిన తీరు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
అటు కలెక్షన్స్ పరంగానూ అదరగొట్టింది. బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా రిలీజై రెండు నెలలు కావస్తున్నా .. ఇంకా ఓటీటీ రిలీజ్ కు నోచుకోలేదు. అందుకు ఓ కారణం ఉంది. రీసెంట్ గా 'తంగలాన్' సినిమాను ఓటీటీలో విడుదల చేయవద్దని తిరువళ్లూరుకు చెందిన పోర్కోడి మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు.
Also Read : నల్ల ప్యాంటు, గళ్ళ కోటు, టీ షర్ట్.. వాహ్! 'రాజా సాబ్' లుక్ అదిరిందయ్యా
ఈ సినిమాలో వైష్ణవులను అవమానించేలా చాలా సన్నివేశాలు ఉన్నాయని ఆయన పిటీషన్ వేశారు. వైష్ణవులను కించపరుస్తూ బౌద్ధమతం గురించి పవిత్రంగా చూపించడంతో.. ఇప్పుడు సినిమాను ఓటీటీలోకి వదిలితే ఇరు మధ్య మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందని, అందుకే ఓటీటీలో సినిమా విడుదలను నిషేధించాలని పిటిషన్‌లో తెలిపారు.
#Thangalaan OTT Release Coming By This Diwali on Netflix
— SRS CA TV (@srs_ca_tv) October 14, 2024
In Tamil Telugu Malayalam Kannada Hindi. pic.twitter.com/WBp6buTs5N
దీపావళికి ఓటీటీలో..
ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు.. 'తంలాన్' సినిమా ప్రభుత్వ నింబధనల మేరకు సెన్సార్ సర్టిఫికెట్ పొంది థియేటర్లలో విడుదలైంది. కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకోలేమని తెలిపింది. అలాగే సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయడానికి ఎలాంటి అడ్డంకి లేదని ఆదేశిస్తూ కేసును కొట్టి వేసింది. దీంతో 'తంగలాన్' ఓటీటీ రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. ఈ దీపావళికి సినిమా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.
Also Read : నా సినిమా బాలేకపోతే థియేటర్ కు రాకండి.. విశ్వక్ సేన్ ఓపెన్ ఛాలెంజ్