/rtv/media/media_files/2025/03/07/wvry4NvgnfkXbvPJtb4E.jpg)
Veera Dheera Sooran-2
Veera Dheera Sooran-2: చియాన్ విక్రమ్(Chiyaan Vikram).. పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan) సినిమాతో మరో సారి తన ప్రతిభను ప్రేక్షకులకు చూపించాడు. మణిరత్నం(Mani Ratnam) తెరకెక్కించిన ఈ మూవీలో విక్రమ్ నటనకు మంచి పేరు లభించింది. విభిన్నమైన పాత్రలతో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను అందించడంలో ముందుంటారు చియాన్ విక్రమ్. అయితే, పొన్నియిన్ సెల్వన్ తర్వాత వచ్చిన తంగలాన్ చిత్రంలో విచిత్రమైన వేషధారణతో ఆకట్టుకున్నప్పటికీ కొన్ని వర్గాల ప్రేక్షకుల్ని మాత్రం నిరాశపరిచింది, కొన్ని రా కంటెంట్ సీన్ల వల్ల కొన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. విక్రమ్ నటన అద్భుతంగా ఉన్నప్పటికీ, ఆ చిత్రం ప్రేక్షకుల మనసుల్ని మెప్పించడంలో విఫలమైంది.
Also Read: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే
అయితే, విక్రమ్ లేటెస్ట్ మూవీ 'వీర ధీర సూరన్ -2' మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Also Read: ముంబైపై గుజరాతీల కుట్ర.. RSS నేతపై దేశద్రోహం కేసు: మాజీ సీఎం సంచలనం!
బెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా..
వీర ధీర సూరన్ -2 చిత్రానికి ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషార విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రియా శిబు ఈ సినిమాను నిర్మించగా, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. బెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ కి సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఇస్తుందని మేకర్స్ అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి స్పందన లభిస్తోంది.
తెలుగులో వీర ధీర సూరన్ -2 సినిమాను ఎన్వీఆర్ సినిమాస్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 2025 మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.