Chiyaan Vikram: ఇలా జరిగిందేంటి.. రిలీజ్ వేళ షోలన్నీ రద్దు! చిక్కుల్లో విక్రమ్ సినిమా

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ లేటెస్ట్ మూవీ ‘వీర ధీర శూరన్‌ పార్ట్‌ 2’ చిక్కుల్లో పడింది. ఈరోజు రిలీజ్ కానుండగా.. అనుకోని కారణాల చేత మార్నింగ్ షోలు రద్దయాయ్యి. దీంతో విక్రమ్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

New Update

Veera Dheera Soora 2: అరుణ్‌కుమార్‌ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వీర ధీర శూరన్‌ పార్ట్‌ 2’. ఇందులో దుషారా విజయన్‌,  ఎస్‌.జె. సూర్య, తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా మార్చి 27.. అంటే ఈరోజు థియేటర్స్ లో విడుదల కానుండగా.. అనుకోని విధంగా చిక్కుల్లో పడింది. లీగల్  సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా మల్టీ ప్లెక్సుల్లో మార్నింగ్ షోలు రద్దయ్యాయి. షోలు రద్దు కావడంతో సదరు థియేటర్ల యాజమాన్యం ప్రేక్షకులకు టికెట్ డబ్బులు తిరిగి పంపిస్తామంటూ సందేశాలు పంపిస్తున్నారు. దీంతో విక్రమ్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 

 telugu-news | cinema-news | chiyaan-vikram

Advertisment
తాజా కథనాలు