/rtv/media/media_files/2025/03/29/dLyykHncbW2ubF4io7IC.jpg)
Veera Dheera Sooran
Veera Dheera Sooran: చియాన్ విక్రమ్(Chiyaan Vikram) తాజా చిత్రం 'వీరధీరశూర' పార్ట్ 2 ఉగాది కానుకగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాకి టాక్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. కంటెంట్ బాగున్నప్పటికీ సరైన టైమ్ లో రిలీజ్ కాలేదు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రమోషన్లు కూడా సినిమాకి బజ్ క్రియేట్ చేయలేకపోయింది. దీనికి తోడు మొదటి షోలు అన్ని రద్దవ్వడం సినిమాకి పెద్ద మైనస్ అయ్యింది.
Also Read: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!
తమిళ్ లో సినిమాపై ఎంతో కొంత హైప్ ఉన్నప్పటికీ తెలుగులో మాత్రం అసలు ఎలాంటి హైప్ లేదు. చియాన్ విక్రమ్ ఎంతో కష్టపడి సినిమాను తెరకెక్కించినా కూడా అది వర్కౌట్ అవ్వలేదు. రిలీజ్ కి ముందు ఎన్ని ప్రమోషన్స్ చేసినప్పటికీ, అనుకోని కారణాలచేత మొదటి ఆట రద్దవ్వడం సినిమాకి పెద్ద తలనొప్పిలా మారింది.
Also Read: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
డిజిటల్ రైట్స్ విషయంలో వివాదం
డిజిటల్ రైట్స్ విషయంలో వివాదం తలెత్తడంతో మార్నింగ్ షోలు రద్దయినట్టు తెలుస్తోంది. అయితే, మూవీ టీమ్ వెంటనే స్పందించి వివాదాన్ని పరిష్కరించేటప్పటికీ, దాదాపు ఈవినింగ్ అయిపోయేసరికి మాట్నీ షో టైమ్ కి కూడా మూవీ రిలీజ్ కాలేకపోయింది. చివరికి విడుదల రోజు కేవలం ఈవినింగ్ షోస్, నైట్ షోస్ తో మాత్రమే 'వీరధీరశూర' పార్ట్ 2 సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Also Read: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్ కు నెతన్యాహు హెచ్చరికలు!
అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మూవీ పై బజ్ లేకపోవడం, షోస్ క్యాన్సిల్ అవ్వడం ఇలా అన్ని కలిసి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 30% కూడా ఆక్యుపెన్సీ కనిపించడం లేదు. హైప్ లేని ఈ మూవీ మరి మౌత్ టాక్ తో అయినా ముందు ముందు మంచి కలెక్షన్స్ రాబడుతుందో లేదో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేసింది.